Site icon HashtagU Telugu

T20 Captain Issue: హార్దిక్ కు వెన్నుపోటు పొడిచింది ఎవరు?

T20 Captain Issue

T20 Captain Issue

T20 Captain Issue: శ్రీలంక టూర్‌కు టీం ఇండియాను ప్రకటించింది బీసీసీఐ. వన్డే ఫార్మేట్ కు యధావిధిగా రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే టీ20 కెప్టెన్ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి వరకు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ హార్దికేనని మాటలు పలికిన బీసీసీఐ మాటా మార్చింది. ఫలితంగా టి20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ పదవి నుంచి కూడా హార్దిక్ పాండ్యాను తొలగించారు.

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్యా టీమ్ఇండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ రిటైర్మెంట్ అనంతరం హార్దిక్‌కు టీ20 పగ్గాలు అప్పగించవచ్చని అంతా భావించారు. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ అంచనాలకు మించి రాణించాడు. ఇదిలా ఉండగా శ్రీలంకతో సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే ముందు బీసీసీఐ పలు సమావేశాలు నిర్వహించిందట. ఆటగాళ్ల ఒపీనియన్ కూడా తీసుకుందట. విశేషం ఏంటంటే కొందరికి కాల్ చేసి మరీ అభిప్రాయాలను సేకరించారట. 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి జట్టును ఎంపిక చేశారు. చివరికి తెలిసింది ఏంటంటే హార్దిక్ పాండ్యా కంటే సూర్యకుమార్ యాదవ్‌పై తమకు నమ్మకం ఉందని టీమిండియా ఆటగాళ్లు చెప్పారట. సూర్య కెప్టెన్సీలో ఆడేందుకు ఇష్టపడతామని భారత ఆటగాళ్లు బీసీసీఐకి చెప్పారట. ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న గంభీర్ హార్దిక్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు.

హార్దిక్ విషయంలో బీసీసీఐ సానుకూలంగా ఉన్నప్పటికీ హార్దిక్ ఫిటినెస్ అతిపెద్ద సమస్యగా ప్రొజెక్ట్ అవుతుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో చీలమండ గాయం కారణంగా హార్దిక్ చాలా కాలం పాటు మైదానానికి దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ముంబై కెప్టెన్ గా ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. దీనికి ముందు కూడా హార్దిక్ గాయాల కారణంగా చాలా టోర్నమెంట్‌లు మరియు సిరీస్‌లకు దూరమయ్యాడు. వాస్తవానికి జట్టు విజయంలో కెప్టెన్ దే కీ రోల్. మరి కెప్టెనే గాయంతో జట్టుకు దూరమైతే తదుపరి పరిణామాలు క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే బీసీసీఐ టి20 పగ్గాలు సూర్యకు ఇచ్చింది. కాగా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Rajiv Gandhi Civil Abhaya Hastham : ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్