Site icon HashtagU Telugu

India Hockey: ఫైనల్లో భారత పురుషుల హాకీ జట్టు

India Hockey Imresizer (1)

India Hockey Imresizer (1)

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ హాకీ టీమ్ పతకానికి అడుగు దూరంలో నిలిచింది. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ ఫైనల్ కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 3-2 తేడాతో గెలిచింది. తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్‌ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే అభిషేక్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ ఖాతా తెరిచింది. ఆ తర్వాత మణిదీప్‌ సింగ్‌ మరో గోల్‌ మెరవడంతో భారత్ 2-0తో ఆధిక్యంలో వెళ్లింది. అయితే మూడో క్వార్టర్ నుంచీ సౌతాఫ్రికా పుంజుకుంది.

రెయాన్‌ జూలిస్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ ఆధిక్యం 2-1కి తగ్గింది. నాలుగో క్వార్టర్‌ మొదలైన రెండో నిమిషంలోనే డ్రాగ్‌ ఫ్లికర్‌ జుగ్‌రాజ్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సౌతాఫ్రికా రెండో గోల్‌ కొట్టడంతో చివర్లో కాస్త ఉ‍త్కంఠ నెలకొంది. ఈ దశలో భారత్‌ డిఫెన్స్ శ్రేణి ప్రత్యర్థిని గోల్స్‌ చేయకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయింది.
ఫైనల్‌లో భారత్‌, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఉత్కంఠగా సాగిన మరో సెమీస్ లో ఆస్ట్రేలియా 3-2 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఆస్ట్రేలియా హాకీ టీమ్ ఏడోసారి ఫైనల్ కీ చేరింది. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న కంగరూలను ఓడించడం అంతా ఈజీ కాదు.

Exit mobile version