Site icon HashtagU Telugu

Indian Coach Gautam Gambhir: రెండో టెస్టుకు ముందు టీమిండియాలో చేరిన గౌత‌మ్ గంభీర్‌!

Gautam Gambhir

Gautam Gambhir

Indian Coach Gautam Gambhir: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు అడిలైడ్‌లో జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Indian Coach Gautam Gambhir) కూడా జట్టులోకి వచ్చాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టు తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన గంభీర్ తాజాగా జ‌ట్టులో చేరిన‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు ధృవీక‌రించాయి. ఇప్పుడు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో డైలమా ఉన్న అడిలైడ్ టెస్టుకు ముందు అతను ఓపెనింగ్‌పై ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంది. తొలి టెస్టులో ఆడని రోహిత్ ఈ మ్యాచ్‌లో జట్టులోకి వచ్చాడు. అలాగే శుభ‌మ‌న్ గిల్ కూడా రెండో టెస్టుకు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. శని, ఆదివారాల్లో ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో గంభీర్ లేడు. అతను నవంబర్ 26న ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు.

ఇప్ప‌టికే తొలి టెస్టులో ఘ‌న‌విజయం సాధించిన భార‌త్ జ‌ట్టు రెండో టెస్టులో కూడా విజ‌యం సాధించాల‌ని టీమిండియా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ, జైస్వాల్ రెండో టెస్టులో కూడా రాణించాల‌ని ఫ్యాన్స్ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. గంభీర్ గైర్హాజరీలో కోచింగ్ స్టాఫ్ అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్‌చాట్ మరియు మోర్నే మోర్కెల్ జట్టు శిక్షణ, కాన్‌బెర్రాలో జరిగిన రెండు రోజుల మ్యాచ్‌కు బాధ్యత వహించారు. ఇప్పుడు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో డైలమా ఉన్న అడిలైడ్ టెస్టుకు ముందు అతను ఓపెనింగ్‌పై ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంది. తొలి టెస్టులో ఆడని రోహిత్ ఈ మ్యాచ్‌లో జట్టులోకి వచ్చాడు.

Also Read: Pushpa 2 : స్టేజిపై పుష్ప నిర్మాతలు.. కౌంటర్ ఇచ్చిన అభిమాని.. టికెట్ రేటు 1200 అయితే ఎలా సర్?

గంభీర్ ఈ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లగలడు

అడిలైడ్ టెస్టులో పెర్త్ టెస్టును గెలిచిన జట్టులో ఓపెనింగ్ జోడీని గంభీర్ రెండో టెస్టులో బ‌రిలోకి దింపుతాడ‌ని స‌మాచారం. ఇక్కడ ఇన్నింగ్స్ ఓపెనింగ్ సమయంలో కెఎల్ రాహుల్‌తో పాటు యశస్వి జైస్వాల్ పటిష్ట ప్రదర్శన చేశారు. ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్‌కి వ్యతిరేకంగా కూడా యశస్వి, రాహుల్‌ల జోడీ మాత్రమే రంగంలోకి దిగారు. పెర్త్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ ఈ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ ఫ్లాప్ అయ్యాడు

ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ప్రత్యేకంగా ఏమీ చేయలేక కేవలం మూడు పరుగులే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా రద్దయింది. అనంతరం రెండో రోజు ఇరు జట్లు 50-50 ఓవర్లు ఆడేలా ఇరు జట్ల కెప్టెన్లు ఓకే చెప్పారు. ఈ మ్యాచ్‌లో బౌలర్ల తర్వాత బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ 50 పరుగులతో చెలరేగిపోయాడు. నలుగురు కంగారూ బ్యాట్స్‌మెన్‌లకు పెవిలియన్ దారి చూపిన ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Exit mobile version