Cricket Racism:బర్మింగ్ హామ్ టెస్టులో జాత్యాహంకార వ్యాఖ్యల కలకలం

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది.

  • Written By:
  • Publish Date - July 5, 2022 / 04:50 PM IST

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లాండ్ జట్టు విజయం దిశగా సాగుతుండగా.. మ్యాచ్ లో నాలుగోరోజు జాత్యాహంకార వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భారత అభిమానులను టార్గెట్ చేస్తూ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది భారతీయ అభిమానులు తాము జాతి వివక్షకు గురయ్యామని ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, వార్విక్ షైర్ బోర్డులు స్పందించాయి. క్షమాపణలు చెబుతూ ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేస్తాయని హామీ ఇచ్చాయి. క్రికెట్‌లో రేసిజంకు ఆస్కారం లేద‌ని, ఎడ్జ్‌బాస్ట‌న్‌లో ఉన్న అంద‌రితోనూ ఈ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని ఈసీబీ తెలిపింది. ఇంగ్లండ్ క్రికెట్‌లో రేసిజం చాలా ఎక్కువ స్థాయిలో ఉన్న‌ట్లు గ‌తంలో యార్క్‌షైర్ మాజీ స్పిన్న‌ర్ అజీమ్ ర‌ఫీక్ తెలిపారు. సురక్షితమైన, సమ్మిళితమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఎడ్జ్‌బాస్టన్ తీవ్రంగా కృషి చేస్తోందని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా తెలిపింది.

ఎడ్జ్ బాస్టన్ వేదికగా తాను జాతి వివక్షకు గురయ్యామని కొంతమంది భారతీయ అభిమానులు ట్విుటర్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. స్డేడియంలోని 22 ఎరిక్ హోలిస్ బ్లాక్ వద్ద కొంతమంది తమ జాతిని ఉద్దేసిస్తూ దూషించారని, కనీసం 10 సార్లు తమపై అసభ్యకర పదజాలాన్ని వాడారని చెబుతున్నారు. అయితే తాము ఒక్కసారి కూడ తాము స్పందించలేదని తెలిపారు. ఏం చేయాలో తెలియక తమ సీట్లలో అలాగే కూర్చుండిపోయామని ఈసీబీకి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ విషయం గురించి అక్కడున్న వాళ్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఈ ఘటనపై ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం కూడా క్షమాపణలు చెప్పింది. ఇంగ్లండ్ క్రికెట్‌లో రేసిజం చాలా ఎక్కువ స్థాయిలో ఉందని గ‌తంలో యార్క్‌షైర్ మాజీ స్పిన్న‌ర్ అజీమ్ ర‌ఫీక్ ఆరోపించాడు. తాజా ఘటనతో మరోసారి అది రుజువైందని రఫీక్ వ్యాఖ్యానించాడు.