Site icon HashtagU Telugu

T20 World Cup: క్రికెటర్లకు తీరని కల.. అదేంటో చూడండి

T20 World Cup

T20 World Cup

T20 World Cup: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నో రికార్డుల్ని తిరగరాశాడు. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. వన్డే, టి20, టెస్ట్ ఫార్మెట్లో కోహ్లీ సాధించిన రికార్డులు మరెవరూ సాదించలేదంటే అతిశయోక్తి కాదు. అయితే విరాట్ కోహ్లీ ఆడిన టీ20 సిరీస్ ల్లో టీమిండియా ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2012, 2014, 2016, 2021, 2022ల్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఆడాడు .2021 సంవత్సరంలో విరాట్ కెప్టెన్​గా బాధ్యతలు వహించాడు. అయినప్పటికీ పొట్టి ప్రపంచకప్ లో ఒక్కసారి కూడా ఫైనల్స్ విజేత కాలేకపోయింది.

టీ20 స్పెషలిస్ట్ గా పేరున్న సురేష్ రైనా కెరీర్లోనూ టి20 ప్రపంచకప్ గెలవలేదు. సురేష్ రైనా తన క్రికెట్ కెరీర్లో 2009, 2010, 2012, 2014, 2016ల్లో టి 20 ప్రపంచకప్ ఆడాడు. వీటన్నిటిలో టీమిండియా ఒక్కసారి కూడా కప్ నెగ్గలేకపోయింది. ఇది రైనాకు లోటుగా మిగిలిపోయింది. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్​లోనూ టీ20 ట్రోఫీ గెలుచుకోలేకపోయాడు. 2012, 2014, 2016, 2021, 2022ల్లో టి20 ప్రపంచకప్ ఆడిన అశ్విన్ టైటిల్ ని ముద్దాడే అవకాశం రాలేదు. అశ్విన్ కెరీర్​లో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. ఇప్పటికే టెస్ట్ నంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ అశ్విన్ ఈ నాటికి 2020 కప్ ను అందుకోలేకపోయారు.

ప్రస్తుతం టీమిండియాలో ఆల్ రౌండ్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా కెరీర్​లో కూడా టీ20 వరల్డ్ కప్ లోటుగా మిగిలిపోయింది. 2009, 2010, 2012, 2016, 2021 ఏడాదిల్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆడాడు. మొత్తం ఐదుసార్లు టీమ్​లో చోటు సంపాదించుకున్నా, ఏ ఒక్కసారి కూడా భారత్ విజేత కాలేకపోయింది.ఇక టీమిండియాలో నమ్మదగ్గ బౌలర్లలో మహమ్మద్ షమీ ఒకడు. షమీ ఇప్పటివరకు నాలుగుసార్లు భారత్ తరపున టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడాడు. అయితే షమీ హయాంలో భారత్ ఒక్కసారి కూడా టి20 ప్రపంచకప్ గెలవలేదు. 2014, 2016, 2021, 2022 నాలుగు టోర్నీల్లోనూ మహమ్మద్ షమీ టీమ్​ఇండియా సభ్యుడిగా ఉన్నా టీమ్​ఇండియా కప్ గెలవలేకపోయింది.

Also Read: Hemant Soren: హేమంత్ సోరెన్ బలపరీక్షకు కోర్టు అనుమతి