విశాఖ వరుణ్ ఐనాక్స్‌లో ‘బోర్డర్-2’ సినిమా చూసిన భారత్ క్రికెటర్లు

Team India Cricketers  న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్ కోసం విశాఖపట్నం వచ్చిన టీమిండియా క్రికెటర్లు కాస్త విరామం తీసుకున్నారు. నిన్న‌ రాత్రి నగరంలోని వరుణ్ ఐనాక్స్‌లో బాలీవుడ్ మూవీ ‘బోర్డర్-2’ చూస్తూ సరదాగా గడిపారు. భారత ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో థియేటర్‌కు చేరుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఒక షోను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సినిమాను వీక్షించిన వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ […]

Published By: HashtagU Telugu Desk
TEAM INDIA WATCHED BORDER 2 MOVIE AT VARUN INOX THEATER

TEAM INDIA WATCHED BORDER 2 MOVIE AT VARUN INOX THEATER

Team India Cricketers  న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్ కోసం విశాఖపట్నం వచ్చిన టీమిండియా క్రికెటర్లు కాస్త విరామం తీసుకున్నారు. నిన్న‌ రాత్రి నగరంలోని వరుణ్ ఐనాక్స్‌లో బాలీవుడ్ మూవీ ‘బోర్డర్-2’ చూస్తూ సరదాగా గడిపారు. భారత ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో థియేటర్‌కు చేరుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఒక షోను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సినిమాను వీక్షించిన వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌, వరుణ్ చక్రవర్తితో పాటు పలువురు సహాయక సిబ్బంది ఉన్నారు.

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. తొలి మూడు మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శనతో గెలిచి 3-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ ఇప్పటికే సొంతం కావడంతో ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా రిలాక్స్ అవుతున్నారు. ఇరు జట్ల మధ్య బుధవారం విశాఖ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.

  Last Updated: 27 Jan 2026, 03:30 PM IST