Site icon HashtagU Telugu

Indian cricketers: పంత్ కోలుకోవాలని భారత క్రికెటర్ల పూజలు

Panth

Panth

న్యూజిలాండ్ తో చివరి వన్డే కోసం ఇరు జట్లు ఇండోర్ చేరుకున్నాయి. కివీస్ ప్రాక్టీస్ చేస్తుండగా…భారత ఆటగాళ్లలో సూర్యకుమార్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ గుడిని సందర్శించారు. పంత్‌ త్వరగా కోలుకోవాలంటూ టీమిండియా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ గుడిలో పూజలు నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ గుడి ఒకటి. శివ లింగానికి బాబా మహాకాల్‌ భస్మ హారతి అర్పించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్‌లో వైరల్‌గా మారాయి.

కారు ప్రమాదానికి గురైన పంత్‌ త్వరగా కోలుకోవాలని పరమ శివుడిని ప్రార్థించామనీ, ఆయన దీవెనలతో పంత్‌ కోలుకొని టీమిండియా జట్టులోకి తిరిగి రావాలని కోరుకున్నట్టు సూర్యకుమార్‌ చెప్పాడు. కివీస్ పై మూడో మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తామని వ్యాఖ్యానించాడు.టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గతేడాది డిసెంబర్‌లో కారు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం పంత్‌ ముంబైలోకి కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పంత్‌కు పలు సర్జరీలు నిర్వహించిన వైద్యులు అతను కోలుకోవడానికి దాదాపు ఆరు నుంచి పది పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ఈ యేడాది మొత్తం పంత్ ఆటకు దూరం కానున్నాడు.