Site icon HashtagU Telugu

Sanju Samson Meets Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిసిన సంజూ శాంసన్.. 21 ఏళ్ల కల తీరిందని ట్వీట్..!

Sanju Samson

Resizeimagesize (1280 X 720) (1)

భారత క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) 21 ఏళ్ల కల నెరవేరింది. సంజూ శాంసన్.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth)ను ఆయన ఇంట్లో కలిశారు. శాంసన్ ట్విట్టర్‌లో రజనీకాంత్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. సంజూ శాంసన్ ఆదివారం రాత్రి ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో అతను రజనీకాంత్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. ఏడేళ్ల వయసున్నప్పటి నుంచే తాను సూపర్ స్టార్ రజనీకాంత్ సార్కు అభిమానినని సంజూ తెలిపాడు. ఎప్పటికైనా రజనీకాంత్ సార్ను కలుస్తానని.. అప్పుడే తన తల్లిదండ్రులకు చెప్పానన్నాడు. 21 ఏళ్ల తర్వాత తన కోరిక నెరవేరిందని..స్వయంగా తలైవా తనను ఇంటికి ఆహ్వానించినట్లు సంజూ శాంసన్ తెలిపాడు.

Also Read: All England Badminton 2023: ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి

రజనీకాంత్‌ను కలవడంపై సంజూ శాంసన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దీనికి కొన్ని గంటల్లో ఏడున్నర వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ఇది మాత్రమే కాదు.. దాదాపు 8 లక్షల 82 వేల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న శాంసన్ ఈ ట్వీట్‌కు దాదాపు లక్ష లైక్‌లు వచ్చాయి. 28 ఏళ్ల సంజూ శాంసన్ టీమిండియా తరఫున 11 వన్డేలు ఆడాడు. ఇందులో అతను రెండు అర్ధ సెంచరీల సహాయంతో 66 సగటుతో 330 పరుగులు చేశాడు. ఇది కాకుండా అతను 17 T20లలో 16 ఇన్నింగ్స్‌లలో 20 సగటుతో 301 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో లేని సంజు.. ఐపీఎల్‌ 2023తో గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. ఐపీఎల్‌లో శాంసన్ రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.