Site icon HashtagU Telugu

Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ గెలవగలదా.. టీమిండియా ఓటముల పరంపర ఎప్పుడు ముగుస్తుందో..?

3rd T20I

India Aim To Seal Odi Series On Rohit Sharma's Return To Cap..

Rohit Sharma Captaincy: ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌ను ఓడించింది. భారత జట్టు ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మపై (Rohit Sharma Captaincy) నిత్యం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్‌గా ఫర్వాలేదు అనిపించినా కెప్టెన్‌గా ఫ్లాప్ అవుతున్నాడు. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నిరంతరం ఫ్లాప్‌ అవుతున్నాడని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ టీమిండియా రెగ్యులర్ కెప్టెన్‌గా మారడంతో భారత జట్టుకు నిరాశే ఎదురైంది.

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్ 2022 ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. ఈ టోర్నీలో భారత జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇది కాకుండా గతేడాది ఆసియా కప్ టోర్నీలో టీమిండియా నిరాశపరిచింది. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను గెలవాలన్న కల చెదిరిపోయింది. ఈ విధంగా దాదాపు 10 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ విజేతగా నిలవాలన్న టీమిండియా కల నెరవేరటం లేదు. రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి టీమిండియా ఏ భారీ టోర్నీని గెలవలేకపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.

Also Read: Ashes Series: ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గెలిచేనా.. 22 ఏళ్ల కల తీరేనా.. జూన్ 16 నుండి యాషెస్..!

2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని గెలిచిన టీమిండియా

భారత జట్టు చివరిసారిగా 2013లో ఐసీసీ టోర్నీని గెలుచుకుంది. 2013 సంవత్సరంలో ఇంగ్లండ్‌ను ఓడించి టీమిండియా ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే అప్పటి నుండి టీమిండియా ఏ ICC టోర్నమెంట్‌ను గెలుచుకోలేకపోయింది. అయితే దీని తర్వాత అనేక ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌తో పాటు టాప్-4కి చేరుకున్నటీమిండియా టోర్నీని గెలవలేకపోయింది. భారత జట్టు T20 ప్రపంచ కప్ 2014 ఫైనల్‌కు చేరుకుంది. అయితే శ్రీలంకపై ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

టీమిండియా ఓటముల పరంపర ఎప్పుడు ముగుస్తుంది?

2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో టీమిండియాను ఆస్ట్రేలియా ఓడించింది. టీ20 ప్రపంచకప్ 2016 సెమీ ఫైనల్స్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా ఓడిపోయింది. దీని తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ భారత్‌ను ఓడించింది. ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు పరాజయాల పరంపర ఇక్కడితో ముగియలేదు. వన్డే ప్రపంచకప్ 2019లో సెమీఫైనల్‌లో టీమిండియా పరాజయం పాలైంది. ఈసారి న్యూజిలాండ్ భారత అభిమానుల హృదయాలను బద్దలు కొట్టింది. అదే సమయంలో ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచ కప్ 2022, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయింది. అయితే భారత జట్టుతో పాటు రోహిత్ శర్మ కెప్టెన్సీపై నిరంతరం ప్రశ్నలు తలెత్తుతున్నాయి.