Mary Kom: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 2014లో ‘మేరీ కోమ్’ అనే చిత్రాన్ని చేసింది. ఈ సినిమా బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్ (Mary Kom), ఆమె భర్త కరుంగ్ ఒన్లర్‌ల ప్రేమ కథను అద్భుతంగా చూపించింది. అయితే ఇప్పుడు మేరీ కోమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆశ్చర్యకరమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె తన భర్త కరుంగ్ ఒన్లర్ నుంచి విడాకులు తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. హిందుస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ జంట కొంత కాలంగా ఒకరికొకరు దూరంగా జీవిస్తున్నారు. ఈ వార్తలు అభిమానులను షాక్‌కు గురి చేశాయి. 2022లో ఒన్లర్ మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయారని, ఆ తర్వాత నుంచి మేరీ కోమ్, ఒన్లర్ మధ్య సంబంధాల్లో దూరం పెరగడం ప్రారంభమైందని నివేదికలో పేర్కొన్నారు.
విడాకులకు కారణం ఏమిటి?
కొన్ని నివేదికలు మేరీ కోమ్ జీవితంలో మరొక వ్యక్తి ప్రవేశించాడని పేర్కొంటున్నాయి. ఆమె క్రికెటర్ హితేష్ చౌదరితో డేట్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నివేదికల్లో ఎంత నిజం ఉందనేది స్పష్టంగా తెలియదు. అయితే మేరీ కోమ్, కరుంగ్ ఒన్లర్ ఇంతవరకు విడాకుల గురించి వచ్చిన వార్తలపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం మేరీ కోమ్ తన భర్త కరుంగ్ ఒన్లర్ నుంచి విడిపోయి, తన పిల్లలతో కలిసి ఫరీదాబాద్‌లోని ఇంట్లో నివసిస్తున్నారు.
Also Read: Gold Loan Rules: ఇకపై బంగారంపై రుణం సులభంగా లభించదా?
ఈ విడాకుల పుకార్లు ఎందుకు వచ్చాయనే దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. 2022లో ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒన్లర్ ఆర్థికంగా కూడా నష్టపోయినట్లు చెబుతున్నారు. ఈ ఓటమి కారణంగా వారి కుటుంబంలో ఒత్తిడి పెరిగి, సంబంధాలు దెబ్బతిన్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇద్దరి నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఇవి కేవలం ఊహాగానాలుగానే మిగిలాయి. మేరీ కోమ్ ఒక బాక్సింగ్ లెజెండ్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఈ సంఘటనలు ఆమె అభిమానులకు ఆందోళన కలిగించాయి. ఆమె జీవితంలో ఏం జరుగుతోందనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు అభిమానులు ఓపికతో ఉండాల్సిందే.