Asia Cup 2023: పాక్‌లో ఆడే ఛాన్సే లేదు..!

ఆసియాకప్‌ 2023 కోసం పాకిస్థాన్‌కు టీమ్‌ను పంపించడంపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చేసింది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ టీమ్‌ను పంపించేది లేదని మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు.

Published By: HashtagU Telugu Desk
India Squad

TEAMINDIA

ఆసియా కప్‌-2023కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నీకి భారత్ జట్టును పంపేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలపై బీసీసీఐ ఎట్టకేలకు స్పందించింది. ఆసియా కప్- 2023 ఎడిషన్ కోసం భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌ కు పంపేదిలేదని క్రికెట్ కౌన్సిల్ చీఫ్ జే షా మంగళవారం ప్రకటించారు. ముంబైలో మంగళవారం జరిగిన 91వ బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ సందర్భంగా షా వ్యాఖ్యలు చేశారు. భారత్ చివరిసారిగా 2005-06లో ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్థాన్‌ కు వెళ్ళింది.

ఆసియాకప్‌ 2023 కోసం పాకిస్థాన్‌కు టీమ్‌ను పంపించడంపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చేసింది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ టీమ్‌ను పంపించేది లేదని మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. పాకిస్థాన్‌కు బదులుగా తటస్థ వేదికలో ఆసియా కప్‌ నిర్వహించాల్సిందిగా ఏసీసీపై ఒత్తిడి తీసుకురానున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. 2012-13లో మూడు టీ20లు, వన్డేల కోసం పాకిస్థాన్ భారత్‌లో పర్యటించిన తర్వాత రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. అప్పటి నుండి రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు.

 

 

  Last Updated: 18 Oct 2022, 03:52 PM IST