IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం 60 ఏళ్ళ చరిత్రను మార్చేసింది. ఎందుకంటే భారత గడ్డపై ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడానికి ఇష్టపడతాడు. గత 60 ఏళ్లలో కాన్పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తొలి కెప్టెన్‌గా హిట్‌మాన్ చరిత్ర సృష్టించాడు. అయితే రోహిత్ నిర్ణయం సరైనదా అన్నది పక్కనపెడితే అక్కడ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
కాన్పూర్‌లో జరిగిన 24 టెస్టు మ్యాచ్‌ల్లో ఒక జట్టు టాస్(Toss) గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి. గతంలో 1964లో ఇంగ్లండ్‌పై ఇదే జరిగింది. వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌ల్లో తొలిసారి భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత గడ్డపై 14వ సారి టాస్ గెలిచిన అనంతరం ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భారత జట్టు 14 మ్యాచ్‌ల్లో 4 సార్లు మాత్రమే ఓడిపోయింది. 2015లో ఇది జరిగింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా ఇప్పుడు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. గ్రీన్ పార్క్ స్టేడియం రికార్డులను పరిశీలిస్తే.. భారత్ ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 23 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్‌లు గెలిచి 3 ఓడింది. అదే సమయంలో 13 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ పిచ్ పై చాలా మ్యాచ్‌లు డ్రా కావడం గమనార్హం. 2021లో న్యూజిలాండ్‌తో గ్రీన్ పార్క్ స్టేడియంలో టీం ఇండియా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది. (IND vs BAN)
ప్రస్తుతం టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలి టెస్టులో విరాట్, రోహిత్, కేఎల్ రాహుల్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ బాధ్యతల్ని అశ్విన్, పంత్, జడేజా, గిల్ తీసుకుని బంగ్లా బౌలర్లను ఉతికారేశారు. దీంతో తొలి టెస్టుట్ను భారత్ ఘనంగా ముగించింది. అయితే రెండో టెస్టులో రోహిత్, కోహ్లీ విశ్వరూపం చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీ చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్ అడుగుతున్నాడు. దీంతో కాన్పూర్ లో ఆయన విజ్రంభించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. అటు రోహిత్ కాస్త స్టాండ్ ఇస్తే టీమిండియా విజయం నల్లేరుమీద నడకలా సాగుతుంది. బౌలర్లు బుమ్రా, అశ్విన్, ఆకాష్ డీప్ ఓ రేంజ్ లో చెలరేగిపోతున్నారు.
Also Read: Kiraak RP : భార్య కు విడాకులు ఇచ్చిన కిరాక్ ఆర్పీ..కారణం అదేనా..?