India: టాస్ గెలిచిన భారత్ (India) ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ముందుగా ఫీల్డింగ్ చేయడానికి మైదానంలోకి వస్తారు. భారత్, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే విజయం కోసం ఇరుజట్ల మధ్య ఇంకా గట్టి పోటీ ఉంటుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రపంచకప్ 2023లో 37వ మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ప్రపంచకప్‌లో వరుసగా ఏడు విజయాలు సాధించిన టీమ్‌ఇండియాకు ఈ మ్యాచ్ తో ఓ సవాల్ ఎదురుకానుంది.
టాస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పిచ్ చాలా బాగుంది. నా అభిప్రాయం ప్రకారం.. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య పోటీ ఉంది. కాబట్టి మ్యాచ్ బాగుంటుందని అంచనా. ఇక్కడ ఆడటం నాకు చాలా ఇష్టం. ఈ చారిత్రాత్మక మైదానంలో ఆడటం భారత జట్టుకు చాలా ఇష్టం. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు అని చెప్పాడు రోహిత్.
Also Read: Kohli – Sand Sculpture : విరాట్ కోహ్లీ బర్త్‌డే స్పెషల్.. జీవకళతో ఇసుక శిల్పం
భారత జట్టు: శుభమన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
We’re now on WhatsApp. Click to Join.