Hopes On Kohli: అడిలైడ్లో రెండో టెస్టుకు టీమిండియా సిద్ధమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ అడిలైడ్ టెస్టుకు తిరిగివచ్చాడు. రోహిత్ రాకతో మిడిల్ అర్దర్ పటిష్టంగా మారింది. ఇక ఈ టెస్టులో విరాట్ (Hopes On Kohli)పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అడిలైడ్ ఓవల్ వేదికగా జరగనున్న ఈ టెస్టులో కోహ్లీ మరోసారి రెచ్చిపోయే అవకాశముంది. అడిలైడ్ మైదానంలో కోహ్లీకి అద్భుతమైన రికార్డుంది. ఈ మైదానంలో విరాట్ ఆడిన నాలుగు టెస్టు మ్యాచుల్లోని 8 ఇన్నింగ్స్‌లలో 63.62 సగటుతో 509 భారీ స్కోర్ నమోదు చేశాడు.
2014లో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా శతకాలు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 141 రన్స్ చేశాడు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్ తో విశ్వరూపం చూపించాడు. ఇప్పుడు అడిలైడ్ టెస్టులో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. ప్రస్తుతం కోహ్లీ అద్భుత ఫామ్ లోకి వచ్చాడు. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగులు మాత్రమే చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 143 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఆడిలైడ్ మైదానంలో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 4 టెస్టులు, 4 వన్డేలు, 3 టీ20ల్లో పాల్గొన్నాడు. ఇందులో మూడు ఫార్మాట్‌లతో సహా అతను 73.61 సగటుతో 957 పరుగులు చేశాడు.
Also Read: Governor Congratulated CM Revanth: సీఎం రేవంత్‌ను అభినందించిన గవర్నర్.. ఎందుకంటే?
అడిలైడ్ ఓవల్‌లో కోహ్లీ మొత్తం ఐదు సెంచరీలు సాధించాడు. ఇందులో టెస్టుల్లో మూడు సెంచరీలు, వన్డేల్లో రెండు సెంచరీలు సాధించాడు. అయితే కోహ్లీ మరో శతకం బాదితే ఆసీస్ గడ్డ మీద ఒకే వేదికలో అత్యధిక సెంచరీలు కొట్టిన పర్యాటక బ్యాటర్‌గా కీర్తి గడిస్తాడు. అయితే కోహ్లీ అడిలైడ్ లోనే కాక ఆసీస్ గడ్డపై ఎక్కడైనా రెచ్చిపోతుంటాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి మొత్తం 14 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 56.03 సగటుతో 1457 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లి 7 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో కోహ్లీ చేసిన 169 పరుగులు ఆస్ట్రేలియాలో అత్యుత్తమ టెస్ట్ స్కోరు. కంగారూ జట్టుపై విరాట్ కోహ్లీ 9 సెంచరీలు చేశాడు.