Site icon HashtagU Telugu

World Cup 2023 : విజృంభించిన భార‌త్ బౌల‌ర్లు.. 243 ప‌రుగుల తేడాతో సౌతాఫిక్రాపై ఘ‌న విజ‌యం

India Squad

Team INDIA

ప్ర‌పంచ క‌ప్ 2023లో భార‌త్ జ‌య‌కేత‌నం ఎగుర వేస్తుంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లో ఎనిమిది గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి స్థానంలో ఉంది. ఈ రోజు (ఆదివారం) సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ బౌల‌ర్లు విజృంభించారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. భారత బౌలర్ల ధాటికి 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. 243 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. జడేజా ఐదు వికెట్లు తీయ‌గా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేసి త‌న ఫ్యాన్స్‌కి గిఫ్ట్ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ (77) అర్థశతకంతో మెరుగ్గా రాణించడం..  ఓపెనర్లు రోహిత్ శర్మ (24 బంతుల్లో 40), శుభ్‌మన్ గిల్ (23) 62 పరుగులతో శుభారంభం అందించారు. ఈ మ్యాచ్ విజ‌యంతో భార‌త్ వ‌రుస‌గా 8 విజయాలను సాధించింది. పాయింట్ల పట్టికలో 16 పాయింట్స్‌తో  అగ్రస్థానంలో ఉంది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాట్స్‌మ‌న్‌లు వ‌రుస‌గా కుప్ప‌కూలారు.

Also Read:  world cup 2023: ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ సరికొత్త చరిత్ర… ఫాన్స్ కు కోహ్లీ బర్త్ డే గిఫ్ట్