జొహాన్నెస్ బర్గ్ (Greenfield International Stadium) లో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో (India won by 8 wickets) దక్షిణాఫ్రికా (India vs South Africa) ఫై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు భారత్ పేసర్ల ధాటికి విలవిల్లాడింది. యువపేసర్లు అర్ష్‌దీప్‌సింగ్, ఆవేశ్‌ఖాన్ నిప్పులు చెరగడంతో 27.3 ఓవర్లో 116 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత 117 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 117 పరుగుల లక్ష్యాన్ని చేదించింది.
We’re now on WhatsApp. Click to Join.
కెరీర్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్ అర్ధసెంచరీతో రాణించడం విశేషం. దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్ 1, ఆండిలే ఫెహ్లుక్వాయో 1 వికెట్ తీశారు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ లో ఫెహ్లుక్వాలియో 33,జార్జి 28,మర్క్రం 12,శంసి 11 పరుగులు మాత్రమే చేశారు. మిగతా బ్యాట్స్ మెన్స్ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ లో ముగ్గురు డక్ అవుట్ గా వెను తిరిగారు. భారత బౌలర్లు లో హర్షిదీప్ సింగ్ 5 వికెట్లు తీయగా ఆవేష్ ఖాన్ నాలుగు వికెట్లు కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో తొలి అడుగు వేసింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే డిసెంబరు 19న కెబెరాలో జరగనుంది.
Read Also : 1 Akash – 4 Targets : ‘ఆకాశ్’ అదుర్స్.. ఒక్క ఫైర్‌తో నేలకూలిన నాలుగు డ్రోన్లు