IND vs ENG 4th Test: నాలుగో టెస్టులో భారత్ విజయం, సిరీస్ సొంతం చేసుకున్న రోహిత్ సేన

ఇంగ్లండ్‍పై నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది. ఈ టెస్టులో రోహిత్, గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు

IND vs ENG 4th Test: ఇంగ్లండ్‍పై నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది. ఈ టెస్టులో రోహిత్, గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా 5 వికెట్లో కోల్పోయిన భారత్ 192 పరుగులు చేసి విజయం సాధించింది.

సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ సేన అదరగొడుతుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. ఆ తర్వాత వైజాగ్ వేదికగా రెండో టెస్టులో కుర్రాళ్ళ విధ్వంసానికి ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహం బెడిసికొట్టింది. రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులోనే భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఈ టెస్టులో భారీ భారీ తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. కాగా రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ మూడు టెస్టులు గెలిచి 3-1 ఆధిక్యం ప్రదర్శించింది.

నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా 46 పరుగుల ఆధిక్యం పొందిన టీమిండియా, రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 145 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ తర్వాత మూడవ రోజున ఇంగ్లాండ్ టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ క్రమంలో భారత్ 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (55), శుభ్‍మన్ గిల్ (52 పరుగులు నాటౌట్) గా నిలిచాడు.

Also Read: IND vs ENG 4th Test: నాలుగో టెస్టులో భారత్ విజయం, సిరీస్ సొంతం చేసుకున్న రోహిత్ సేన