Site icon HashtagU Telugu

world cup 2023: టీమిండియా బౌలర్ల విధ్వంసం.. ఇంగ్లాండ్ కు మరో ఓటమి

World Cup 2023 (64)

World Cup 2023 (64)

world cup 2023:  ల‌క్నో వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా 100 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌ళ్లీ అగ్ర‌స్థానానికి చేరుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న విరాట్ జీరో స్కోర్ తో నిరాశపరిచాడు. అయితే సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ గౌరవప్రదమైన ఇన్నింగ్స్ ఆడటంతో స్కోర్ బోర్డు 229 కి చేరింది. ఇంగ్లండ్ బౌలింగ్‌లో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు పడగొట్టాడు. వోక్స్ , ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు తీశారు,అలాగే మార్క్ వుడ్ ఒక వికెట్ తీశాడు.

స్వల్ప లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. షమీ చురకత్తులాంటి బంతులు సంధించడంతో బ్రిటిషర్లు వణికిపోయారు. ఆరంభ ఓవర్లలో బుమ్రా, షమీలు ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను దెబ్బతీయగా కుల్దీప్‌ యాదవ్‌.. ఇంగ్లీష్‌ జట్టు సారథి జోస్‌ బట్లర్‌ (23 బంతుల్లో 10) ను ఔట్‌ చేసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో స్టార్ బ్యాటర్స్ బ‌ట్ల‌ర్ క్లీన్‌బౌల్డ్‌, బెయిర్‌ స్టో క్లీన్‌బౌల్డ్‌, బెన్‌స్టోక్స్ క్లీన్‌బౌల్డ్‌ అయ్యారు. ఇక ఇండియా తదుపరి మ్యాచ్ నీ శ్రీ లంక తో ఆడనుంది.

ఇంగ్లాండ్ జట్టు: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్ మరియు మార్క్ వుడ్.

భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు మహ్మద్ సిరాజ్.

Also Read: Vizianagaram : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం