INDIA 100 Medals : పారా ఆసియా గేమ్స్‌లో ఇండియా ‘సెంచరీ’.. పారా అథ్లెట్లకు సలాం

INDIA 100 Medals : చైనాలోని హాంగ్​జౌ వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు కొనసాగిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
India 100 Medals

India 100 Medals

INDIA 100 Medals : చైనాలోని హాంగ్​జౌ వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు కొనసాగిస్తోంది. ఈ క్రీడల్లో శనివారం ఉదయం నాటికి భారత్‌కు చెందిన పారా అథ్లెట్లు సాధించిన పతకాల సంఖ్య 100కు చేరింది. 2018 పారా ఆసియా క్రీడల్లో భారత్ కేవలం 72 పతకాలను సాధించింది. అయితే ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసింది. శనివారం ఉదయం పురుషులకు చెందిన 400 మీటర్ల పరుగు పందెంలో అథ్లెట్‌ దిలీప్‌ మహదు గవిత్‌ ​ స్వర్ణం సాధించడంతో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 100కు చేరింది. పురుషుల 400 మీటర్ల పరుగును 49.48 సెకన్లలో దిలీప్‌ పూర్తిచేసి గోల్డ్ గెల్చుకున్నాడు. భారత్ ఇప్పటివరకు సాధించిన 100 పతకాల్లో 26 స్వర్ణాలు, 29 రజతాలు, 45 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం పారా ఆసియా క్రీడల పతకాల పట్టికలో ఇండియా ఆరో స్థానంలో ఉంది. ఈనేపథ్యంలో భారత పారా అథ్లెట్లకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాశ్మీర్‌కు చెందిన 16ఏళ్ల శీతల్‌ దేవి శుక్రవారం జరిగిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. గత వారం ఆమె సింగిల్స్‌ విభాగంలో స్వర్ణం నెగ్గింది.  మహిళల డబుల్స్‌లోనూ రజత పతకం చేజిక్కించుకొని ఆర్చరీలో మూడు పతకాలు సాధించిన తొలి పారా క్రీడాకారిణిగా శీతల్‌ దేవి నిలిచింది. రెండు చేతుల్లేని శీతల్‌ ఆర్చరీలో కాళ్లతోనే విల్లంబులను సంధించి పతకాలను కొల్లగొట్టడం విశేషం.పురుషుల 1500 మీటర్ల పరుగులో రమన్‌ శర్మ ఆసియా గేమ్స్‌ రికార్డు బద్దలు కొట్టాడు. రమన్‌ 4 నిమిషాల 20:80సెకన్లలో గమ్యానికి చేరాడు.

Also Read: Secunderabad Cantonment: గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్, కాంగ్రెస్ వ్యూహం ఇదే!

  Last Updated: 28 Oct 2023, 11:37 AM IST