Site icon HashtagU Telugu

U19 India: మహిళల అండర్ 19 వరల్డ్ కప్ విజేత భారత్

U19 Women

U19 Women

U19 Women World CUP: మహిళల అండర్ 19 క్రికెట్ లో భారత్ చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికా వేదిక గా జరిగిన వరల్డ్ కప్ లో విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. టోర్నీ ఆరంభం నుంచీ అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్న భారత్ టైటిల్ పోరులో అదరగొట్టింది. ఇంగ్లాండ్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు మన బౌలర్లు. సమిష్టిగా చెలరేగిన భారత బౌలర్లు ఇంగ్లాండ్ ను 68 రన్స్ కే అలౌట్ చేశారు. తర్వాత లక్ష్య చేధనలో దూకుడుగా ఆడిన టీమిండియా తొలిసారి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్ చరిత్రలో భారత్ కు ఇదే మొదటి వరల్డ్ కప్…

భారత మహిళల జట్టు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. సీనియర్ మహిళల టీమ్ మూడు సార్లు వన్డే, టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరినా.. టైటిల్ అందుకోలేకపోయారు. దాంతో మహిళల విభాగంలో తొలి ఐసీసీ టైటిల్ అందించే సువర్ణవకాశం షెఫాలీ సేన జారవిడవ లేదు. అరంగేట్ర అండర్ 19 ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత అమ్మాయిలు ప్రపంచ కప్ కలను నిజం చేశారు.