U19 womens Asia Cup: అండర్-19 మహిళల ఆసియా కప్ (U19 womens Asia Cup) ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. టైటిల్ పోరులో భారత్ ,బంగ్లాదేశ్ హోరాహోరీగా పోటీ పడ్డాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 117/7 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ త్రిష 52 (47) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
118 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ మొత్తం 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేక పేకమేడలా కుప్పకూలింది. దీంతో ఆ జట్టు 76 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బ్యాటర్లలో జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. అయితే భారత్ టైటిల్ విజయంలో బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషించింది. ఆయుషి శుక్లా 3 వికెట్లు పడగొట్టింది. పూర్ణికా సిసోడియా, సోనమ్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. వీజే జోషితకు ఒక వికెట్ దక్కింది. బంగ్లా బౌలర్లలో ఫర్జానా నాలుగు వికెట్లు తీసింది. నిషితా అక్తర్ నిషి రెండు వికెట్లు, హబిబా ఓ వికెట్ పడగొట్టింది.
Also Read: CM Revanth Reaction: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!
టీ20 ఫార్మాట్‌లో మొదటి సారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో బంగ్లాదేశ్ పై 41 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అంతకుముందు భారత పురుషుల జట్టు అండర్-19 ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే బంగ్లాదేశ్ చేతిలో టైటిల్ పోరులో ఓటమి పాలైంది. దానికి ప్రతీకారంగా మహిళలు బంగ్లాదేశ్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు.