India Women Tour Of Australia: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 తర్వాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. దీని కోసం ఇప్పటికే టీ20, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ తాజాగా భారత మహిళల టెస్టు జట్టును కూడా ప్రకటించింది. దీనితో పాటు ఏసీసీ (ACC) రైజింగ్ స్టార్ మహిళల ఆసియా కప్ కోసం కూడా టీమ్ ఇండియాను ఎంపిక చేశారు. ఈ జట్టులో ఒక యువ స్టార్‌కి తొలిసారిగా అవకాశం దక్కింది.
టీమ్ ఇండియా ప్రకటన
ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు 3 వన్డేలు, 3 టీ20లతో పాటు ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. టీ20, వన్డే జట్లను జనవరి 17న ప్రకటించగా, జనవరి 24న ఏకైక టెస్టు కోసం జట్టును బీసీసీఐ వెల్లడించింది. ఈ టెస్టు జట్టులో వైష్ణవి శర్మ చోటు దక్కించుకున్నారు. వైష్ణవి ఇటీవల టీమ్ ఇండియా తరపున టీ20 అరంగేట్రం చేసి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే జట్టులో ప్రధాన బాధ్యత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానపైనే ఉండనుంది.
అదేవిధంగా ఏసీసీ రైజింగ్ స్టార్ మహిళల ఆసియా కప్ 2026 కోసం రాధా యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ జట్టులో కూడా పలువురు యువ స్టార్ క్రీడాకారిణులు కనిపిస్తున్నారు.
Also Read: అదిరిపోయిన నిహారిక కొత్త సినిమా.. రాకాసి గ్లింప్స్
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, సాయాలీ సత్ఘరే.
ACC రైజింగ్ స్టార్ ఆసియా కప్ కోసం ఇండియా-ఏ జట్టు
హుమైరా కాజీ, బృందా దినేష్, అనుష్క శర్మ, దియా యాదవ్*, తేజల్ హసబ్నిస్, నందిని కశ్యప్ (వికెట్ కీపర్), మమత ఎం (వికెట్ కీపర్)*, రాధా యాదవ్ (కెప్టెన్), సోనియా మెంధియా, మిన్నూ మణి, తనుజా కన్వర్, ప్రేమ రావత్, సైమా ఠాకోర్, జింతామణి కలిత, నందిని శర్మ. (*- BCCI COE నుండి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది)
