Site icon HashtagU Telugu

CWG T20 : గోల్డెన్ చాన్స్ మిస్, రజతంతో సరిపెట్టుకున్న వుమెన్స్ టీమిండియా..!!

Women T20

Women T20

కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత మహిళల క్రికెట్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో టీమిండియా వుమెన్స్ టీం 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. బెత్ మూనీ హాఫ్ సెంచరీ సహాయంతో ఈ ఈవెంట్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత జట్టు స్వర్ణానికి కొద్ది దూరంలోనే నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 19.3 ఓవర్లలో 152 పరుగులు చేయగలిగింది. మహిళల క్రికెట్‌ను తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా చేయడంతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది.

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్య ఛేదనలో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చేసింది. మ్యాచ్‌లో అత్యధికంగా 65 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ తన 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు. ఆమెతో పాటు జెమీమా రోడ్రిగ్స్ 33 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున ఆష్లే గార్డనర్ 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, మేగన్ షట్ 2 వికెట్లు తీశాడు. డార్సీ బ్రౌన్, జెస్ జాన్సన్ చెరో వికెట్లు తీశారు.