Site icon HashtagU Telugu

India Women beat England: భారత మహిళలదే తొలి వన్డే

Smriti Imresizer

Smriti Imresizer

ఇంగ్లాండ్ టూర్ లో టీ ట్వంటీ సీరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు వన్డే సీరీస్ లో శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ను భారత్ బౌలర్లు ఆరంభం నుంచే దెబ్బతీశారు. ప్రధాన బ్యాటర్లు ఏ ఒక్కరినీ క్రీజులో నిలువనివ్వలేదు. దీంతో ఇంగ్లాండ్ 128 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయింది. కనీసం 150 రన్స్ అయినా స్కోర్ చేస్తుందా అనిపించింది ఈ దశలో వ్యాత్, రెచర్డ్, ఎలక్స్తాన్ ఆదుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ మహిళల జట్టు 50 ఓవర్లలో 227 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 , గోస్వామి , మేఘన , గైక్వాడ్ , స్నేహ రాణా తలో వికెట్ తీశారు.
228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ త్వరగానే షెఫాలి వర్మ వికెట్ కోల్పోయింది. అయితే ఫాంలో ఉన్న స్మృతి మందాన మరోసారి అదరగొట్టింది. ఇంగ్లాండ్ బౌలర్ల పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. వికెట్ కీపర్ భాటియా హాఫ్ సెంచరీతో చక్కని సపోర్ట్ ఇచ్చింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 96 రన్స్ జోడించారు. భాటియా 50 రన్స్ ఔటవగా…మందాన దూకుడు కొనసాగించింది. హార్మన్ ప్రీత్ తో కలిసి మూడో వికెట్ కు 99 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేసింది. మందనా 91 రన్స్ కు ఔటై శతకం చేజార్చుకోగా…హార్మన్ , డియోల్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సీరీస్ లో రెండో మ్యాచ్ బుధవారం జరుగుతుంది