Sadhguru: భారత్ వరల్డ్ కప్ గెలుస్తుంది, ఆసీస్ ను తక్కువ అంచనా వేయకూడదు: సద్గురు

Sadhguru: ప్రపంచమంతటా వరల్డ్ కప్ ఫీవర్ కనిపిస్తోంది. రేపు జరుగబోయే మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందా? లేదా ఆసీస్ కప్పు కొడుతుందా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక వేత్త సద్గురు టీమిండియాకు తన తన మద్దతు తెలిపారు. అహ్మదాబాద్‌లో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత జట్టును సద్గురు హాజరై ఉత్సాహపర్చనున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించనున్న సద్గురు ఇండియానే కప్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ప్రపంచకప్ లో భారత జట్టు ఎంతో గొప్పగా ఆడింది. […]

Published By: HashtagU Telugu Desk
Sadguru

Sadguru

Sadhguru: ప్రపంచమంతటా వరల్డ్ కప్ ఫీవర్ కనిపిస్తోంది. రేపు జరుగబోయే మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందా? లేదా ఆసీస్ కప్పు కొడుతుందా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక వేత్త సద్గురు టీమిండియాకు తన తన మద్దతు తెలిపారు. అహ్మదాబాద్‌లో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత జట్టును సద్గురు హాజరై ఉత్సాహపర్చనున్నారు.

నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించనున్న సద్గురు ఇండియానే కప్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ప్రపంచకప్ లో భారత జట్టు ఎంతో గొప్పగా ఆడింది. మన క్రికెట్ జట్టు ఈ ఆటని, మునుపెన్నడూ లేనంతగా, పూర్తిగా మరో స్థాయికి వెళ్లింది. వరుస విజయాలతో మంచి ఊపు ఉందన్నారు. ఈ బలమైన జట్టుకు కప్ గెలుస్తుందనడంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని అన్నారు.

ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఆసీస్ జట్టును తక్కువ అంచనా వేయకూడదు, అలాగే వారిని గురించి భయపడాల్సిన పని కూడా లేదు. మన ధ్యాసల్లా  ఆటను పూర్తిస్థాయిలో ఆడటం గురించే అయి ఉండాలి, మన ఆటగాళ్లు సరిగ్గా అదే చేస్తారు, 140 కోట్ల మంది కలలను నెరవేరుస్తారని అనుకుంటున్నా. అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్స్‌కు, మ్యాచ్ చూస్తూ నేను మీతో పాటు ఉంటాను అని అన్నారాయన.

  Last Updated: 18 Nov 2023, 05:47 PM IST