India Semifinals: భారత్ సెమీఫైనల్‌కు వెళ్లాలంటే ఈ జట్లను ఓడించాల్సిందే..!

భారత జట్టు ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే సెమీఫైనల్‌ (India Semifinals)కు వెళ్లే మార్గం సులభమవుతుంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కూడా సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Semi Final Scenario

Semi Final Scenario

India Semifinals: 2023 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు జరిగాయి. మంగళవారం దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య 15వ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఉన్న పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్ అగ్రస్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. భారత జట్టు ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే సెమీఫైనల్‌ (India Semifinals)కు వెళ్లే మార్గం సులభమవుతుంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కూడా సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

తొలి మూడు మ్యాచ్‌ల్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇందులో రెండు మ్యాచ్‌లు పెద్ద జట్లతో తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీఫైనల్‌ దిశగా దూసుకెళ్తుంది.

Also Read: India vs Bangladesh: భారత్‌- బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్.. పైచేయి ఎవరిదంటే..?

We’re now on WhatsApp. Click to Join.

ప్రమాదకరమైన ఫామ్‌లో ఉన్న మూడు జట్లతో భారత్ పోటీపడుతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు న్యూజిలాండ్.. భారత్‌తో తలపడనుంది. అక్టోబర్ 22న భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత భారత్ అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో తలపడనుంది. నవంబర్ 5న సౌతాఫ్రికాతో మ్యాచ్ జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు భారత్‌కు చాలా కీలకం. వాటిని గెలవడం తప్పనిసరి కూడా.

ప్రస్తుత ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచింది. న్యూజిలాండ్‌కు 6 పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లు ఆడగా.. రెండింటినీ భారీ తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా 102 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఆస్ట్రేలియాను 134 పరుగుల తేడాతో ఓడించింది. అందువల్ల సెమీఫైనల్‌కు భారత్‌తో పాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కూడా పోటీ పడుతున్నాయి.

  Last Updated: 17 Oct 2023, 12:42 PM IST