Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy) ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆసక్తిగా లేదు. దుబాయ్‌లోని పరిస్థితులకు అలవాటు పడటానికి టీమిండియా బంగ్లాదేశ్ లేదా యుఎఇతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తొలుత వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదట. నిజానికి టీమిండియా హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుంది. భారత జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఉంటుంది. కానీ అంతకుముందు బంగ్లాదేశ్‌తో మరియు యుఎఇతో ప్రాక్టీస్ మ్యాచ్ జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
నిజానికి ఫిబ్రవరి 19 కల్లా భారత్ మరియు బంగ్లాదేశ్ తప్ప, మిగతా అన్ని జట్లన్నీ పాక్ లో ఉంటాయి. నెక్స్ట్ భారత్, బంగ్లా మధ్య దుబాయ్ లో మ్యాచ్ జరగనున్నందున ఈ రెండు జట్లు దుబాయ్‌లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ గురించి చర్చలు జరిగాయి. కానీ టీమిండియా నిరాకరించినట్లు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్‌పై ఉన్న అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి. సమాచారం.ఫిబ్రవరి 12న ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఫిబ్రవరి 15న దుబాయ్ చేరుకుంటుంది. ఇక్కడ టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుంది.
Also Read: Wriddhiman Saha: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
రోహిత్ శర్మ నాయకత్వంలో రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను నెగ్గాలని భావిస్తుంది. 2002లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకతో కలిసి ఉమ్మడి ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత రెండు ఫైనల్స్ వర్షం కారణంగా రద్దయ్యాయి. దీని తర్వాత 2013లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు మినీ ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని ఊవిళ్లూరుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్‌లతో పాటు గ్రూప్ Aలో ఉండగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా గ్రూప్-బిలో చోటు దక్కించుకున్నాయి.