Site icon HashtagU Telugu

India: నేటి నుంచి భార‌త్‌- ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య వ‌న్డే సిరీస్‌… 444 రోజుల త‌ర్వాత స్వదేశంలో ఆడ‌నున్న టీమిండియా!

India

India

India: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్‌లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ వన్డే సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్‌తో ఇరు జట్లూ తమ సన్నాహాలపై దృష్టి సారించనున్నాయి. ఈ సిరీస్‌లో టీ-20 సిరీస్‌లో 1-4 తేడాతో గెలిచింది టీమ్‌ఇండియా. టీ20ల్లో ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని జోస్ బట్లర్ జట్టు భావిస్తోంది. అయితే ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాలో (India) చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక్కడ జట్టులోని చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జ‌ట్టులో భాగ‌మ‌య్యారు. ఈ సిరీస్ భారత జట్టుకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సిరీస్‌తో టీమిండియా 444 రోజుల తర్వాత స్వదేశంలో వన్డే మ్యాచ్ ఆడనుంది. 2023 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన ODI ప్రపంచ కప్ ఫైనల్‌లో జట్టు చివరి ODI మ్యాచ్‌ని స్వదేశంలో ఆడింది. ఫైన‌ల్‌లో జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అలాగే వ‌న్డే వ‌రల్డ్ క‌ప్‌ను సైతం కోల్పోవాల్సి వ‌చ్చింది.

Also Read: Ram Charan : ఆర్‌సీ 16 సెట్స్‌లోకి స్పెషల్‌ గెస్ట్‌.. రామ్‌ పోస్ట్‌ వైరల్‌

తొలి మ్యాచ్‌ నాగ్‌పూర్‌లో జరగనుంది

గత కొంత కాలంగా అత్యుత్తమ ఫామ్‌లో లేని రోహిత్, విరాట్ వంటి సీనియర్ బ్యాట్స్‌మెన్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో గురువారం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది.అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పాల్గొనడం సందేహంగా మారింది. ఇలాంటి స‌మ‌యంలో మహ్మద్ షమీ మ్యాచ్ ఫిట్‌నెస్ భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు ముఖ్యమైనదిగా మారింది.

వికెట్ కీపర్ విషయంలో రాహుల్, పంత్ మధ్య పోటీ

భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో వికెట్ కీపర్ కోసం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్య పోటీ నెల‌కొంది. మరోవైపు ఇంగ్లండ్ ODI మ్యాచ్‌కు ఒక రోజు ముందు త‌మ జ‌ట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ జ‌ట్టులో అనుభవజ్ఞుడైన జో రూట్ 2023 ODI ప్రపంచ కప్ తర్వాత మొదటిసారి ODIకి తిరిగి వస్తున్నాడు.