INDIA WI ODI Series: అహ్మాదాబాద్ చేరుకున్న విండీస్ జట్టు

భారత్ తో వన్డే , టీ ట్వంటీ సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:47 PM IST

భారత్ తో వన్డే , టీ ట్వంటీ సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది. ఇంగ్లాండ్ తో స్వదేశంలో ఐదు టీ ట్వంటీల సిరీస్ ముగిసిన మరుసటి రోజే నేరుగా భారత్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం విండీస్ ఆటగాళ్ళందరూ మూడు రోజుల క్వారంటైన్ లో ఉండనున్నారు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ప్రాక్టీస్ చేసేందుకు ఒకరోజు మాత్రమే వారికి అవకాశం దక్కింది. ఫిబ్రవరి 6 నుండి అహ్మదాబాద్ వేదికగా వన్డే సిరీస్ మొదలు కానుంది. మూడు వన్డేల సిరీస్ తర్వాత కోల్ కతా వేదికగా టీ ట్వంటీ సిరీస్ జరుగుతుంది. ఇంగ్లాండ్ పై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన కరేబియన్ టీమ్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. స్వదేశంలో భారత్ ను ఓడించడం తమకు గొప్ప మైలురాయిగా మిగిలిపోతుందని విండీస్ కెప్టెన్ పొల్లార్డ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్ ఆడడం ద్వారా భారత పిచ్ లపై విండీస్ ఆటగాళ్ళకు మంచి అవగాహన ఉంది. మరోవైపు ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్న భారత క్రికెటర్లు గురువారం నుండి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలిసారి రోహిత్ శర్మ బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు పొల్లార్డ్ సారథ్యంలోని విండీస్ జట్టులో డారెన్ బ్రేవో, జాసన్ హోల్డర్ , హోప్ , కీమర్ రోచ్ , నికోలస్ పూరన్ వంటి స్టార్ ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు.