Site icon HashtagU Telugu

India vs Zimbabwe: భారత్-జింబాబ్వే మధ్య నేడు తొలి టీ20 మ్యాచ్!

Zimbabwe Beat India

Zimbabwe Beat India

India vs Zimbabwe: భారత్-జింబాబ్వే (India vs Zimbabwe) మధ్య నేడు తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. టీ20 క్రికెట్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత్ తన తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వడంతో పాటు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించడంతో యువ స్టార్లతో ఉన్న‌ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. తమ ప్రతిభను నిరూపించుకుని జట్టును విజయపథంలో నడిపించాల్సిన బాధ్యత ఈ క్రికెటర్లపై ఉంటుంది. జింబాబ్వే జట్టులో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. వారు వారి అనుభవం ఆధారంగా యువ ఆటగాళ్లకు స‌వాలు విసిరే అవ‌కాశం ఉంది.

గిల్- అభిషేక్ ఓపెనింగ్‌

భారత జట్టుకు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా రావొచ‌చు. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ మొత్తం 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 147 స్ట్రైక్‌తో మొత్తం 335 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. గిల్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 126 పరుగులు. గిల్‌కు 103 ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం ఉంది. చాలా మ్యాచ్‌ల్లో అతను 135 స్ట్రైక్ రేట్‌తో 3216 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో గిల్ 4 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో జింబాబ్వేపై అభిషేక్ శర్మ అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్‌లో అభిషేక్ ఇప్పటివరకు 63 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 155 స్ట్రైక్‌తో 1376 పరుగులు చేశాడు. అతను 7 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.

Also Read: Rohit Sharma- Jasprit Bumrah: ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు రోహిత్‌, బుమ్రా ఎందుకు ఎంపిక‌య్యారు..?

మీరు మ్యాచ్ ఎక్కడ చూడవచ్చు..?

స్టార్ స్పోర్ట్స్‌లో భారత్- జింబాబ్వే మధ్య జరిగే ఈ మ్యాచ్‌ను మీరు ప్రత్యక్షంగా చూడలేరు. ఈ సిరీస్‌ని ప్రసారం చేసే హక్కులు సోనీ స్పోర్ట్స్‌కి ఉన్నాయి. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీలివ్‌లో చూడవచ్చు. సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

We’re now on WhatsApp : Click to Join

టీమిండియా జ‌ట్టు అంచ‌నా

శుభమన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.

జింబాబ్వే జట్టు అంచ‌నా

సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జొనాథన్ క్యాంప్‌బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కీయా, క్లైవ్ ఎం, వెస్లీ మెద్వెరే, టి మారుమణి, వెల్లింగ్టన్ మసకజా.