వెస్టిండీస్ తో రెండో వన్డేలో భారత్ గెలుస్తుందని చాలా మంది ఊహించలేదు. బ్యాటింగ్ లో ఓ మోస్తరు స్కోరు మాత్రమే సాధించిన టీమిండియాకు బౌలర్లు అద్భుతమైన విజయాన్ని అందించారు. యువ పేసర్ ప్రసిద్ధ కృష్ణ అదిరిపోయే స్పెల్ తో విండీస్ ను దెబ్బతీశాడు. దీంతో ప్రసిద్ధ కృష్ణ విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత పిచ్ లపై అలాంచి స్పెల్ చూసి చాలా రోజులైందని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. సూపర్ పేస్ తో ప్రసిద్ధ అదరగొట్టాడని కితాబిచ్చాడు. లైన్ అండ్ లెంగ్త్ ను ప్రతీ బంతికీ పాటించడం చాలా అరుదుగా చూస్తుంటామని తెలిపాడు. మ్యాచ్ లో పలు సవాళ్ళు ఎదురయ్యాయని, బ్యాటింగ్ లో సూర్యకుమార్, రాహుల్ చక్కగా ఆడారని చెప్పాడు. వన్డే ఫార్మేట్ లో పార్టనర్ షిప్స్ చాలా ముఖ్యమని, వారిద్దరూ పరిణితితో ఆడడం జట్టుకు లాభిస్తుందన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని ప్రయోగాలు చేయాలని భావించినందునే పంత్ ను ఓపెనర్ గా దింపినట్టు వెల్లడించాడు. తర్వాతి మ్యాచ్ కు శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చే అవకాశముందని రోహిత్ తెలిపాడు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ధావన్ తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో భారత్ 44 పరుగులతో విజయం సాధించింది. సూర్యకుమార్, రాహుల్ రాణించడంతో భారత్ 237 పరుగులు చేయగలిగింది. ఛేజింగ్ లో టీమిండియా పేసర్ ప్రసిద్ధ కృష్ణతో పాటు మిగిలిన బౌలర్లూ రాణించడంతో సౌతాఫ్రికా 193 పరుగులకే ఆలౌటైంది. ప్రసిద్ధ కృష్ణ 9 ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది.
India vs West Indies: ప్రసిద్ధ్ పేస్ అదిరింది

Prasidh Krishna