IND vs SL: లంకపై జోరు కొనసాగేనా?

ఆసియా కప్ లో భాగంగా టీమిండియా ఏ రోజు శ్రీలంకతో ఆడనుంచి. అంతకుముందు భారత్ పాకి పై భారీ తేడాతో నెగ్గింది. సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్ లో బ్యాటర్లు సత్తా చాటితే బౌలర్లు పాక్ ఆటగాళ్లను వణికించేసిశారు.

IND vs SL: ఆసియా కప్ లో భాగంగా టీమిండియా శ్రీలంక మధ్య రసవత్తర పోరు మొదలైంది. అంతకుముందు భారత్ పాకి పై భారీ తేడాతో నెగ్గింది. సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్ లో బ్యాటర్లు సత్తా చాటితే బౌలర్లు పాక్ ఆటగాళ్లను వణికించేసిశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ , శుభ్ మన్ గిల్ చెరో హాఫ్ సెంచరీతో శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత వచ్చిన పరుగుల యంత్రం కింగ్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెరో సూపర్ సెంచరీతో పాక్ ఆటగాళ్ల పతనాన్ని శాసించారు. ఇన్నింగ్స్ లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగ బౌల్ చేసి 5 వికెట్లు తీసుకున్నాడు.

టీమిండియా మూడు రోజులుగా రెస్ట్ లెస్ గా ఆడుతుంది. మొదటి రోజు పాక్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడగా నిన్న సోమవారం అదే మ్యాచ్ కంటిన్యూ అయింది. ఇక ఈ రోజు వరుసగా మూడో రోజు మరోసారి బరిలోకి దిగనుంది. కొలంబో వేదికగా జరుగనున్న సూపర్‌-4 మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆటగాళ్లపైనే అందరి దృష్టి. ఇక ఓపెనర్లు రోహిత్ గిల్ కూడా మంచి ఫామ్ లో కనిపించారు. అటు బౌలింగ్ ఫార్మేట్ అద్భుతంగా ఉంది. బుమ్రా, పాండ్యా , కుల్దీప్, ఠాకూర్ రాణిస్తున్నారు. పాక్ పైన భారీ విజయాన్ని అందుకున్న ఆటగాళ్లు అదే జోరుని లంకపై కొనసాగించాలని ఉవిళ్లూరుతున్నారు.

Also Read: Video Viral: ర్యాంప్ వాక్ చేస్తుండగా ఈడ్చిపడేసిన సెక్యూరిటీ.. వీడియో వైరల్?