మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా దుమ్మురేపింది. రవీంద్ర జడేజా విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోవడంతో టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్ ని 574 పరుగుల వద్ద డిక్లర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 129.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 574 పరుగుల భారీ స్కోరు సాధించింది. రవీంద్ర జడేజా 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 228 బంతులు ఎదుర్కొన్న జడేజా 175 పరుగులు చేసి టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ లో మూడు సిక్సులు, 17 ఫోర్లు ఉన్నాయి.
జడేజా తర్వాత రిషబ్ పంత్ 96 పరుగులతో రెండవ స్కోరర్ గా నిలవగా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 61 పరుగులు చేసి అర్థ సెంచరీతో అలరించాడు. హనుమ విహారి 58 పరుగులు ,కోహ్లీ 45 పరుగులు చేసి రాణించడంతో భారత్ 574 పరుగుల వద్ద డిక్లర్ ప్రకటించింది.ఇక శ్రీ లంక బౌలర్స్ లో లక్మల్ రెండు వికెట్లు,పెర్నాండో రెండు వికెట్లు, లసిత్ రెండు వికెట్లు తీయగా ,లహీరు కుమార 1 ,దనుంజయ ఒక వికెట్ తీసుకున్నారు. మొదటి రోజు ఆరు వికెట్లకు 357 పరుగులు చేసిన భారత్ ,రెండవ రోజు జడేజా దూకుడుతో 500కు పైగా స్కోరు నమోదు చేసింది. జడేజాకి స్పిన్నర్ అశ్విన్ కూడా సహకారం అందించాడు. బ్యాటింగులో దుమ్ము లేపిన టీమిండియా బౌలింగ్ లో కూడా అదే స్థాయిలో రాణిస్తే మొదటి టెస్టులో రోహిత్ సేన విజయం అందుకునే అవకాశం ఉంది.