Asia Cup Final: నేడే ఆసియా కప్ ఫైనల్.. కప్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ తో భారత్ ఢీ..!

నేడు కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో ఆసియాకప్‌ ఫైనల్‌ (Asia Cup Final) జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక (India vs Sri Lanka) జట్లు మరోసారి ఆసియా కప్ టైటిల్ గెలవడానికి చూస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 17, 2023 / 11:28 AM IST

Asia Cup Final: నేడు కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో ఆసియాకప్‌ ఫైనల్‌ (Asia Cup Final) జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక (India vs Sri Lanka) జట్లు మరోసారి ఆసియా కప్ టైటిల్ గెలవడానికి చూస్తున్నాయి. భారత జట్టు 7 సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. శ్రీలంక 6 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు పైచేయి సాధించింది? ఇరు జట్ల గణాంకాలు ఏం చెబుతున్నాయి? భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్‌లలో హెడ్ టు హెడ్ రికార్డ్‌ ఎలా ఉంది..? ఈ టోర్నీలో ఇరు జట్ల ప్రయాణం ఎలా ఉందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం?

శ్రీలంకపై టీమిండియాదే పైచేయి

భారత్-శ్రీలంక మధ్య ఇప్పటి వరకు 166 వన్డే మ్యాచ్‌లు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో టీం ఇండియా 97 మ్యాచ్‌లు గెలిచింది. కాగా, భారత జట్టు శ్రీలంక చేతిలో 57 సార్లు ఓడింది. ఇరు జట్ల మధ్య 1 మ్యాచ్ టైగా ముగిసింది. ఇది కాకుండా 11 మ్యాచ్‌ల ఫలితాలు వెల్లడి కాలేదు. వన్డే మ్యాచ్‌ల్లో శ్రీలంకపై భారత జట్టు విజయ శాతం 58.43గా ఉంది. శ్రీలంకపై భారత జట్టు పైచేయి సాధించినట్టు ఈ గణాంకాలే చెబుతున్నాయి.

ఇరు జట్ల ప్రయాణం సాగింది ఇలా

ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్, శ్రీలంకల ప్రయాణాన్ని పరిశీలిస్తే రెండు జట్లు 1-1 మ్యాచ్‌లో ఓడిపోయాయి. బంగ్లాదేశ్‌పై భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాగా, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్థాన్, నేపాల్, శ్రీలంకలను ఓడించింది. దాసున్ షనక జట్టు భారత్‌పై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే సూపర్-4 రౌండ్‌లో శ్రీలంక.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించింది. అంతకుముందు లీగ్ దశలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లను శ్రీలంక ఓడించింది. అయితే ఆసియా కప్ ఫైనల్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Neeraj Chopra: డైమండ్‌ లీగ్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్న నీరజ్‌ చోప్రా..!

భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు (అంచనా): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (వికె), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ్ డి సిల్వా, దసున్ షనక (సి), దునిత్ వెల్లెజ్, సహన్ అరాచిగే, ప్రమోద్ మదుషన్, పతిరణ.