India vs Sri Lanka: టీమిండియా ఈ నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా 3 మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది. కాగా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండాలని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు జస్ప్రీత్ బుమ్రాలను అభ్యర్థించాడు హెడ్ కౌచ్ గౌతమ్ గంభీర్. టి20 ఇంటర్నేషనల్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ(Rohit Sharma) మరియు కోహ్లీ(Kohli)తో పాటు ఫాస్ట్ బౌలర్ బుమ్రా(Bumrah) శ్రీలంక పర్యటనకు దూరంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గంభీర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టుని సిద్ధం చేయాలనీ అనుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా కఠిన నిర్ణయాలకు వెనుకాడటం లేదు. అయితే టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ కుటుంబాలతో సమయం గడుపుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విదేశాల్లో ఉన్నారు. అయితే శ్రీలంకతో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉండాలని గంభీర్ కోరినప్పటికీ రోహిత్, కోహ్లీ మరియు బుమ్రా ఇంకా స్పందించలేదు.అయితే బుమ్రా మాత్రం మూడు ఫార్మాట్లలో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు. మరోవైపు శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కు ఎవర్ని కెప్టెన్‌గా నియమిస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.
హార్దిక్‌ను కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను వైస్‌కెప్టెన్‌గా నియమించనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా భారత్ శ్రీలంక మధ్య తొలి టీ20 జూలై 27న జరగనుంది. రెండ టీ20 జూలై 28న, మూడో టీ20 జూలై 30న జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్టు 2న తొలి వన్డే జరగనుంది. రెండో వన్డే ఆగస్టు 4, మూడో వన్డే ఆగస్టు 7న జరగనుంది.
Also Read: R Narayana Murthy : ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్ నారాయణమూర్తి.. పిక్స్ వైరల్..