Site icon HashtagU Telugu

India vs Sri Lanka: భారత్-శ్రీలంక షెడ్యూల్‌లో మార్పు.. జూలై 27 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం..!

India vs Sri Lanka

India vs Sri Lanka

India vs Sri Lanka: ఈ నెలాఖరులో అంటే జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో (India vs Sri Lanka) పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేలు, టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు అందులో కాస్త మార్పు వచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జులై 26 నుంచి మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా ఇప్పుడు దానిని జూలై 27కి మార్చారు. భారత్-శ్రీలంక మధ్య వన్డే, టీ20 మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో తెలుసుకుందాం.

భారత్-శ్రీలంక షెడ్యూల్‌లో మార్పు ఏమిటి?

జూలై నెలాఖరులోగా టీమిండియా శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. దీని కోసం బీసీసీఐ షెడ్యూల్‌ను ప్రకటించింది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జూలై 26న జరగాల్సి ఉంది. అయితే బీసీసీఐ ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసి అందులో మార్పులు చేసింది. భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ జూలై 26న జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం జులై 27కి వాయిదా పడింది. వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆగస్టు 1న జరగాల్సి ఉండగా.. దానిని ఆగస్టు 2కి మార్చారు.

భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ కొత్త షెడ్యూల్

టీ20 సిరీస్

వన్డే సిరీస్

మ్యాచ్‌లు ఏ సమయానికి ఆడతారు..?

భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా వన్డే సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరగనున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. హార్దిక్ పాండ్యా T20 లో కెప్టెన్‌గా కనిపిస్తాడు. అయితే KL రాహుల్‌కు ODI కమాండ్ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

గంభీర్‌కు కోచ్‌గా తొలి సిరీస్‌

రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని బీసీసీఐ ఇటీవల నియమించిందని మ‌న‌కు తెలిసిందే. గంభీర్ 2027 వరకు టీమ్ ఇండియాలో కోచ్‌గా ఉండబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్ కోచింగ్‌లో టీమిండియా తొలిసారి పర్యటించనుంది. గౌతమ్ గంభీర్‌కు ఈ సిరీస్ చాలా ముఖ్యమైనది. గంభీర్‌ ఈ సిరీస్‌ను గెలవాలనుకుంటున్నాడు.