India vs Sri Lanka: పాకిస్థాన్‌ను 228 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఫైనల్‌కు అడుగులు వేసింది. పాకిస్థాన్ తర్వాత ఇప్పుడు టీమిండియా మంగళవారం శ్రీలంక (India vs Sri Lanka)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత జట్టు విజయం సాధిస్తే, 2023 ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డులకెక్కుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా ఫైనల్‌కు చేరే అవకాశం భారత్‌కు ఉంటుంది.
రౌండ్-4 మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే 18 గంటల వ్యవధిలో భారత ఆటగాళ్లు మళ్లీ మైదానంలోకి రానున్నందున భారత్‌కు లంకతో మ్యాచ్ అంత సులభం కాదు. రెండు రోజుల విరామం తర్వాత శ్రీలంక జట్టు మైదానంలోకి దిగనుంది. శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ రేసులో కొనసాగుతోంది.
Also Read: Virat Kohli: రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు..!
ప్రస్తుత ఫామ్ చూస్తుంటే శ్రీలంకపై భారత్ దే పైచేయి కనిపిస్తోంది. పాకిస్థాన్ తో మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచింది. పాకిస్థాన్‌పై భారత్ 356 పరుగుల భారీ స్కోరు చేసింది. దీని తర్వాత భారత బౌలర్లు పాక్ ఇన్నింగ్స్‌ను కేవలం 128 పరుగులకే కుదించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించగలిగింది. నెట్ రన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది.
శ్రీలంకతో మ్యాచ్‌లో ఓడిపోయినా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో భారత్ ఫైనల్‌కు పోటీదారుగా ఉంటుంది. సెప్టెంబరు 15న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ నుంచి భారత్ ఫైనల్‌కు టిక్కెట్ పొందవచ్చు. బంగ్లాదేశ్‌ను ఓడించడం భారత్‌కు పెద్ద కష్టమేమీ కాదు. టోర్నీలో ఇప్పటివరకు బంగ్లాదేశ్ జట్టు . ఈరోజు జరిగే మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోతే ఫైనల్‌కు చేరుకోవడం కాస్త కష్టతరమే. అయితే, పాకిస్థాన్‌ను ఓడించడం ద్వారా శ్రీలంక ఫైనల్‌కు టిక్కెట్‌ను పొందవచ్చు.