India vs Sri Lanka: నేడు మూడో టీ20.. సిరీస్​పై కన్నేసిన ఇరుజట్లు..!

నేడు శ్రీలంక- భారత్ (India vs Sri Lanka) మధ్య మూడో టీ20 జరగనుంది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - January 7, 2023 / 08:01 AM IST

నేడు శ్రీలంక- భారత్ (India vs Sri Lanka) మధ్య మూడో టీ20 జరగనుంది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. బౌలింగ్ వైఫల్యంతో టీ20 మ్యాచ్ ను చేజార్చుకున్న భారత్ ఈ మ్యాచ్ లో సత్తా చాటుతుందో లేదో చూడాలి. లంక బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ సత్తా చాటుతుంది. టీమిండియా తప్పులను సరిదిద్దుకోవాలని, శ్రీలంకతో శనివారం జరిగే మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్ లో విజయం సాధించాలని చూస్తుంది. రెండో టీ20లో విజయాన్ని సాధించిన తర్వాత శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Also Read: J&K : జ‌మ్ము క‌శ్మీర్‌లో 20 మంది ఐపీఎస్ అధికారులు బ‌దిలీ

శనివారం రాత్రి 7 గంటలకు జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు ఇప్పుడు రంగం సిద్ధమైంది రాజ్‌కోట్‌. టీ20 సిరీస్‌లో ఇదే ఆఖరి మ్యాచ్‌ కావడంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంటుంది. T20 సిరీస్ తర్వాత భారత్ జనవరి 10 నుండి శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌ను ఆడనుంది. నేడు జరగనున్న మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. కాగా సీనియర్లు లేకుండా బరిలోకి దిగుతున్న భారత జట్టులో బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో భారత అభిమానులు నిరాశచెందుతున్నారు. గత మ్యాచ్ లో నోబాల్స్ తో పాటు మ్యాచ్ ఓటమికి పరోక్ష కారణమైన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్ లో ఆడటం కష్టంగానే ఉంది. రెండో టీ20 మ్యాచ్ లో రెండు ఓవర్లు వేసి ఐదు నోబాల్స్ వేయడమే గాక భారీగా పరుగులిచ్చిన అతడిపై మూడో టీ20 లో వేటు ఖాయమే అనిపిస్తోంది.

శ్రీలంక జట్టు (అంచనా): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.

భారత్ జట్టు (అంచనా): ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్