Site icon HashtagU Telugu

World Cup 1996: 28 సంవత్సరాల క్రితం ఇదే రోజున మంటల్లో ఈడెన్ గార్డెన్స్‌

World Cup 1996

World Cup 1996

World Cup 1996: 28 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈడెన్ గార్డెన్స్‌లో క్రికెట్ ఫ్యాన్స్ నిప్పంటించారు. టీమిండియా ఓటమిని తట్టుకోలేక స్టేడియంలో రచ్చ చేశారు. ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా శ్రీలంక మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరు పలు ప్రదేశాల్లో నిప్పంటించారు.

1996 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు బౌలర్లు జట్టుకు శుభారంభం అందించడంతో భారత్‌కు 252 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అయితే శ్రీలంక ఇచ్చిన ఈ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో భారత జట్టు ఒత్తిడికి గురైంది. సచిన్ అవుటైన వెంటనే వరుసగా వికెట్లు పడ్డాయి.

ఆ ఏడాది ప్ప్రపంచకప్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేసి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది, అయితే సెమీ-ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అర్జున్ రణతుంగ సారథ్యంలోని శ్రీలంక జట్టు 8 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో అరవింద్ సిల్వా ఇన్నింగ్స్ 66 పరుగులు చేయగా, జవగల్ శ్రీనాథ్, సచిన్ టెండూల్కర్ 2 వికెట్లు తీశారు. సమాధానంగా భారత్‌కు శుభారంభం లభించలేదు. నవజ్యోత్ సిద్ధూ 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీని తర్వాత సచిన్ టెండూల్కర్ జట్టు ఇన్నింగ్స్‌ను తన భుజాలపై వేసుకుని శ్రీలంక స్పిన్నర్‌లను ఎదుర్కొన్నాడు. సచిన్ హాఫ్ సెంచరీ చేసి జట్టును 100 పరుగుల దగ్గరకు తీసుకెళ్లాడు. 25వ ఓవర్ వరకు భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 98 పరుగులు. దీని తర్వాత (67) పరుగుల స్కోరు వద్ద సచిన్‌ను జయసూర్య స్టంపౌట్ చేశాడు.

జయసూర్య 7 ఓవర్లలో 12 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అజహర్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.దీంతో 1 వికెట్‌కు 98 పరుగుల స్కోరు నుంచి భారత్ స్కోరు 8 వికెట్లకు 120 పరుగులకు చేరుకుంది. భారత్ 22 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పూర్తిగా శ్రీలంక వైపు సాగింది. భారత్ ఓడిపోవడాన్ని చూసి స్టాండ్స్‌లోని అభిమానులు కోపంతో స్టేడియంలోని సీట్లకు నిప్పంటించారు. కొంతమంది ప్రేక్షకులు మైదానంలో మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లపై సీసాలు విసిరారు. ఈ దృశ్యాన్ని చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అంత సులభం కాలేదు. అభిమానులు ఆగ్రహంతో ఇలా చేయడంతో వినోద్ కాంబ్లీ క్రీజులో ఉన్నాడు. అనిల్ కుంబ్లే అతనితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత్ ఇంకా గెలవగలదని కాంబ్లీ నమ్మకంగా ఉన్నాడు, అయితే పరిస్థితి మరింత దిగజారడం చూసి, రిఫరీ శ్రీలంకను విజేతగా ప్రకటించాడు.

Also Read: Tollywood : హీరోలు జీరోలు..కమెడియన్స్ హీరోలు

Exit mobile version