భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్‌ చివరి టీ20!

IND vs SA : భారత్ – దక్షిణాఫ్రికా మధ్య నేడు ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో 2 – 1తో భారత్ ఆధిక్యంలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తోంది. సొంతగడ్డపై సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, టీ 20 వరల్డ్ కప్ ముందు దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. అహ్మదాబాద్‌లో వాతావరణం కూడా ఎలాంటి పొగమంచు లేకుండా మ్యాచ్‌కు అనుకూలంగా ఉంది. […]

Published By: HashtagU Telugu Desk
Ind Vs Sa 5th T20..

Ind Vs Sa 5th T20..

IND vs SA : భారత్ – దక్షిణాఫ్రికా మధ్య నేడు ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో 2 – 1తో భారత్ ఆధిక్యంలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తోంది. సొంతగడ్డపై సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, టీ 20 వరల్డ్ కప్ ముందు దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. అహ్మదాబాద్‌లో వాతావరణం కూడా ఎలాంటి పొగమంచు లేకుండా మ్యాచ్‌కు అనుకూలంగా ఉంది.

  • నేడు భారత్ – దక్షిణాఫ్రికా ఆఖరి టీ20
  • అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్
  • గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోన్న భారత్

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఈ రోజు ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను టీమిండియా గెలవగా, రెండో మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడో మ్యాచ్‌లో భారత్ గెలిచి 2 – 1తో సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. లక్నో వేదికగా జరగాల్సిన నాలుగో మ్యాచ్ పొగమంచు కారణంగా టాస్ పడకుండానే రద్దయింది. దాంతో ఆఖరి టీ 20 మ్యాచ్ ఇటు భారత్, అటు సౌతాఫ్రికాకు కీలకం కానుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి స్కై వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా ప్రతి సిరీస్‌లోనూ విజయం సాధిస్తూనే ఉన్నాడు. స్కై కెప్టెన్సీ స్వీకరించిన తర్వాత ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆస్ట్రేలియా వేదికగా వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుని వరల్డ్ నెంబర్ వన్ టీమ్‌ అని మరోసారి నిరూపించింది.

పొట్టి ఫార్మాట్‌లో వరుసగా భారత్ 13 సిరీస్‌లు సొంతం చేసుకుంది. ఇక సొంతగడ్డపై సఫారీలతో జరుగుతున్న ఆఖరి టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అహ్మదాబాద్ పిచ్‌ టీమిండియాకు ఎక్కువ అనుకూలంగా ఉండటంతో, ఆఖరి టీ20లో భారత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో ఓడిన తర్వాత మర్కరమ్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. టెస్టులో రాణిస్తున్న సఫారీలు టీ20ల్లో మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుండటం, అదీ భారత్ వేదికగా జరగనుండటంతో ఈ సిరీస్ సౌతాఫ్రికాకు చాలా కీలకంగా మారనుంది. మరి ఆఖరి టీ20లో సౌతాఫ్రికా ఎలాంటి పోటీ ఇస్తుందో వేచి చూడాలి.

టీమిండియా జట్టు అంచనా

సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

దక్షిణాఫ్రికా జట్టు అంచనా

క్వింటన్ డికాక్, ఎయిడెన్ మర్కరమ్, ట్రిస్టన్ స్టబ్స్, డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సన్, కార్బిన్ బాష్, నోకియా, ఎంగిడీ/బార్ట్‌మన్.

  Last Updated: 19 Dec 2025, 10:42 AM IST