India vs South Africa: మొదటి మ్యాచ్ వర్షార్పణం.. మరి రెండో మ్యాచ్ పరిస్థితేంటి..?

భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది.

  • Written By:
  • Updated On - December 11, 2023 / 02:28 PM IST

India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. డర్బన్ స్టేడియం వద్ద వేలాది మంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం స్టేడియంకు చేరుకున్నారు. అయితే అభిమానులు నిరాశ చెందారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ రద్దయ్యాక.. ఇప్పుడు సిరీస్ కైవసం చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు ఇరుజట్లలో ఏదో ఒక జట్టు గెలవాల్సిందే. భారత్-దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌లో మూడో మ్యాచ్ డిసెంబర్ 12న జరగనుంది. సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక రెండో మ్యాచ్‌లో కూడా వర్షం ముప్పు పొంచి ఉందో లేదో చూద్దాం.

వాతావరణ శాఖ ఏం చెబుతుంది..?

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య సిరీస్‌లో రెండో మ్యాచ్ రేపు సెయింట్ జార్జ్ పార్క్ క్రికెట్ స్టేడియంలో అంటే డిసెంబర్ 12వ తేదీ రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌పై వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఈ మ్యాచ్‌లోనూ వర్షం కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండో టీ20 మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం 45 శాతం ఉందని ఆ శాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో మ్యాచ్‌లోనూ వర్షం పడడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో కూడా వర్షం పడే అవకాశం 40 నుంచి 45 శాతం ఉంటుందని చెప్పినప్పటికీ వర్షం కారణంగా ఒక్క ఓవర్ కూడా ఆట సాగలేదు. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో కూడా వర్షం పడే అవకాశం 45 శాతం ఉంది. ఇలాంటి పరిస్థితిలో వర్షం కారణంగా రెండవ మ్యాచ్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది.

Also Read: Free Bus Survices: మహిళలకు ఫ్రీ టికెట్..ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి?

మ్యాచ్ రద్దుపై మాజీ కెప్టెన్ ఆగ్రహం

వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దు కావడంతో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు బాధ్యత వహించాలని మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు. గ్రౌండ్‌ను సరిగ్గా కవర్ చేయకపోతే వర్షం ఆగిన తర్వాత కూడా మరో గంట పాటు మ్యాచ్ జరగదని గవాస్కర్ చెప్పాడు.

We’re now on WhatsApp. Click to Join.