T20 World Cup 2024: దాయాది దేశాలు బరిలోకి దిగితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. భారత్ పాకిస్థాన్ జట్లు తలపెడితే క్రికెట్ ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే స్టేడియం హౌస్‌ఫుల్ కావాల్సిందే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటీవల అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆ క్రేజ్‌ను అభిమానులు ఇంకా మర్చిపోలేదు. మ్యాచ్ టికెట్ ధరలు, అలాగే మైదానం పరిసర ప్రాంతాల్లో హోటల్ ధరలు ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేశాయి. ఇప్పుడు అలాంటి వార్తలే అమెరికా వాసులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ప్రస్తుతం టీమిండియా ఐపీఎల్ బిజీలో ఉంది. ఈ టోర్నీ తర్వాత భారత్ టీ ట్వంటీ వరల్డ్‌కప్ ఆడుతుంది. టి20 ప్ప్రపపంచకప్ లో భాగంగా భారత్ , పాకిస్థాన్ జట్లు జూన్ 9న న్యూయర్క్ వేదికగా తలపడనున్నాయి. దీంతో టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి.ఒక్కో టిక్కెట్ ధర 1.86 కోట్లు పలుకుతోంది. ఒక మ్యాచ్ కోసం, అది కూడా కేవలం ఒక టికెట్ ధర ఈ రేంజ్ లో ఉండటం చూసి అమెరికన్లు షాకవుతున్నారట. మరోవైపు పాక్ తో మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుంది అంటున్నారు మన ఇండియన్స్.
Also Read: Vande Bharat Express: అందుబాటులోకి మరో రెండు వందే భారత్ రైళ్లు..!