Asia Cup 2025 Title: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ద్వారా టీమ్ ఇండియా తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను (Asia Cup 2025 Title) కైవసం చేసుకుంది. ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ఈ ఫైనల్ పోరు చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు తమ అప్రతిహత విజయం పరంపరను కొనసాగించి మొత్తం టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచింది.
Also Read: Vijay Car Collection: తమిళ నటుడు విజయ్ వద్ద ఉన్న కార్లు ఇవే..!
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦 🏆
A dominant performance capped by an unbeaten campaign 💪
Congratulations to #TeamIndia on winning #AsiaCup2025 🇮🇳 🥳
Scorecard ▶️ https://t.co/0VXKuKPkE2#Final pic.twitter.com/n9fYeHfByB
— BCCI (@BCCI) September 28, 2025
మ్యాచ్‌లో కీలక సమయాల్లో బ్యాట్స్‌మెన్, బౌలర్లు చూపిన సమష్టి ప్రదర్శన, ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని ఆడటం భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. భారత విజయం పట్ల దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మ్యాచ్ పూర్తి వివరాలు
భారతదేశం ఆసియా కప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో టీమ్ ఇండియా మొత్తం 9వ సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులు చేయగా, ఛేదనలో భారత జట్టు చివరి ఓవర్‌లో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ విజయంలో యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ (69 పరుగులు) భారత విజయానికి నిజమైన హీరోగా నిలిచాడు. బౌలింగ్‌లో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేసి 4 వికెట్లు పడగొట్టాడు.
పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగగా, సాహిబ్జాదా ఫర్హాన్- ఫఖర్ జమాన్ 84 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఫర్హాన్ 57 పరుగులతో అర్థసెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఫర్హాన్ ఔట్ కాగానే ఇతర పాక్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరి 62 పరుగులలోపు పాకిస్తాన్ తన 10 వికెట్లను కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది.
గిల్-అభిషేక్ ఫ్లాప్, తిలక్ షో
టోర్నమెంట్ మొత్తం విధ్వంసం సృష్టించిన ఓపెనర్లు అభిషేక్ శర్మ కేవలం 5 పరుగులు, శుభమన్ గిల్ 12 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన పేలవమైన ఫామ్‌ను మెరుగుపరుచుకోలేకపోయాడు. ఆయన కేవలం 1 పరుగుకే ఔటయ్యాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో కెప్టెన్ సూర్య కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ కీలక సమయంలో తిలక్ వర్మ టీమిండియాను ఆదుకున్నాడు. తిలక్ నాటౌట్‌గా 69 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కష్టసమయంలో తిలక్ వర్మ, సంజు శాంసన్ మధ్య వచ్చిన 57 పరుగుల భాగస్వామ్యం భారత విజయ ఆశలను సజీవంగా ఉంచింది. శాంసన్ కూడా కీలక సమయంలో 21 బంతుల్లో 24 పరుగులు చేసి ముఖ్యమైన పాత్ర పోషించాడు.
9వ సారి ఛాంపియన్ భారత్
భారత జట్టును 9వ సారి ఆసియా ఛాంపియన్‌గా నిలపడంలో తిలక్ వర్మ సహకారం చాలా గొప్పది. భారత్ 10 పరుగులకే రెండవ వికెట్ కోల్పోయినప్పుడు తిలక్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఒక పరిణతి చెందిన బ్యాట్స్‌మెన్‌లా ఆడిన తిలక్ వర్మ 67 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను సాధించాడు. ఆసియా కప్ టైటిల్‌ను అత్యధిక సార్లు (9 సార్లు) గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానంలో శ్రీలంక (6 సార్లు) ఉంది.
ఆసియా కప్ 2025లో పాకిస్థాన్, భారత్ చేతిలో వరుసగా మూడు సార్లు ఓడిపోయి (హ్యాట్రిక్ ఓటమి) తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. గ్రూప్ దశలో భారత్ 7 వికెట్ల తేడాతో, సూపర్-4లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు ఫైనల్‌లో కూడా భారత జట్టు పాకిస్తాన్‌ను చిత్తుచేసి విజయాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది.