2024 T20 World Cup – India vs Pakistan : భారత్,పాక్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా ?

  • Written By:
  • Publish Date - January 5, 2024 / 09:13 PM IST

వన్డే ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) ఓటమి నుంచి క్రమంగా కోలుకుంటున్న భారత క్రికెట్ అభిమానులు (Cricket Fans) కొత్త ఏడాదిలో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా,వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) జూన్ నెలలో జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ(ICC) ప్రకటించింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్‌ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా పోటీపడనున్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్తాన్ తో పాటు ఐర్లాండ్‌, కెనడా, యూఎస్‌ఏ జట్లు చోటు దక్కించుకున్నాయి. గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా,నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌, ప్‌-సిలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌, ఉగాండ, పపువా న్యూ గినియా ఉన్నాయి. ఇక గ్రూప్‌-డిలో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో పాటు బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌ జట్లు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు జూన్‌ 1 నుంచి 18 వరకు జరగనుండగా..సూపర్‌ 8 స్టేజ్ మ్యాచ్‌లు జూన్‌ 19 నుంచి 24 వరకు జరుగుతాయి. జూన్ 1న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్ లో యూఎస్‌ఏ ,కెనడా తలపడనున్నాయి. మెగా టోర్నీ గ్రూప్‌ దశలో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్ తోనూ, జూన్ 9న పాకిస్తాన్ తోనూ, జూన్ 12న యూఎస్ఎతోనూ, జూన్ 15న కెనడాతోను తలపడుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతాయి. భారత్ , పాక్ మ్యాచ్ కు న్యూయార్క్ ఆతిథ్యమివ్వనుండగా.. క్రికెట్ అభిమానులు ఈ సమరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వన్డే వరల్డ్ కప్ లో భారత్ పాక్ పై గెలిచి మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించడంతో పొట్టి ఫార్మాట్ లోనూ అదే జోరు చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Also : Murder Attempt On KA Paul : కేఏ పాల్‌పై హత్యాయత్నం..?