Site icon HashtagU Telugu

T20 Viewership: అట్లుంటది దాయాదుల పోరు అంటే… వ్యూయర్ షిప్ లో నయా రికార్డ్

Viewers Imresizer

Viewers Imresizer

ఆడుతోంది చిరకాల ప్రత్యర్ధులు…అందులోనూ టీ ట్వంటీ వరల్డ్ కప్…స్టేడియంలో 90 వేలకు పైనే ఫాన్స్..ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ ను వీక్షించే ఫాన్స్ ఏ స్థాయిలో ఉంటారో చెప్పక్కర్లేదు.
తాజాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎంతో ఉత్కఠభరితంగా జరిగింది. విరాట్ కోహ్లీ , హార్దిక్ పాండ్య పార్టనర్ షిప్…చివర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం..అభిమానులను ఉత్కంఠతో ఊపేసింది. ఫలితంగా ఈ మ్యాచ్ వ్యుయర్ షిప్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఈ మ్యాచ్ దెబ్బకు గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఆసియా కప్ లో భారత్ , పాక్ తొలి మ్యాచ్‌ కోటీ 30 లక్షల వ్యూస్‌తో ఐపీఎల్ 2022 సీజన్, గత టీ20 ప్రపంచకప్ వ్యూయర్‌షిప్ రికార్డులను బద్దలు కొడితే.. తాజా భారత్ X పాక్ మ్యాచ్ కోటీ 80 లక్షల వ్యూస్ నమోదు చేసింది. హాట్‌స్టార్‌లోనే ఇన్ని వ్యూస్ రావడంతో టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించినట్లేనని అంచనా వేస్తున్నారు. భారత్ విజయంతో అభిమానులు ఒకరోజు ముందే దీపావళీ పండుగ చేసుకుంటుండగా.. స్టార్ స్పోర్ట్స్ కు భారీగానే లాభాలు తెచ్చిపెట్టింది.
ప్రపంచకప్ తొలి మ్యాచ్ కావడం.. ఓటమి అంచుల నుంచి భారత్ విజయాన్నందుకోవడం రికార్డు వ్యూయర్ షిప్ ఒక కారణం అయితే కింగ్ కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్ మరో కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతూ అభిమానులకు అసలు సిసలు మజాను అందించింది

Exit mobile version