Site icon HashtagU Telugu

India Vs Pak : మెగా టోర్నీలో మళ్ళీ భారత్ పాక్ సమరం

Ind Vs Pak

Ind Vs Pak

ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. నిజానికి ఈ టోర్నీ 2020 లోనే జరగాల్సి ఉండగా కరోనా ప్రభావంతో ఈ ఏడాదికి వాయిదా పడింది. తాజాగా ఈ మెగా టోర్నీ షెడ్యూల్ , గ్రూప్ వివరాలు ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 16 నుండి తొలి రౌండ్ మ్యాచ్ లు ఆరంభం కానుండగా…అక్టోబర్ 22 నుండి సూపర్ 12 స్టేజ్ షురూ కానుంది. భారత్ , పాకిస్థాన్ జట్లు మళ్ళీ ఒకే గ్రూప్ లో చోటు దక్కించుకున్నాయి. అక్టోబర్ 23న ఈ రెండు జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా హై ఓల్టేజ్ క్లాష్ జరగనుంది. భారత్ , పాక్ జట్లతో పాటు సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ , మరో రెండు క్వాలిఫైయింగ్ టీమ్స్ ఇదే గ్రూప్ లో ఉన్నాయి.

టీమ్ ఇండియా షెడ్యూల్ చూస్తే తొలి మ్యాచ్ లో పాక్ తో తలపడనుండగా…అక్టోబర్ 27న క్వాలిఫైయింగ్ టీమ్ తోనూ , అక్టోబర్ 30న సౌత్ ఆఫ్రికాతోనూ, నవంబర్ 2న బంగ్లాదేశ్ తోనూ ఆడనుంది. సూపర్ 12 చివరి మ్యాచ్ లో మరో క్వాలిఫైయింగ్ టీమ్ తో తలపడనుంది. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ పాకిస్థాన్ తోనే తొలి మ్యాచ్ ఆడిన టీమ్ ఇండియా చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు పాక్ పై రివేంజ్ తీర్చుకునేందుకు మంచి అవకాశమని అభిమానులు చెబుతున్నారు.

ఇక సూపర్ 12కు నేరుగా అర్హత సాధించలేక పోయిన శ్రీలంక , వెస్ట్ ఇండీస్ జట్లు స్కాట్లాండ్ , నమీబియా లతో పాటు మరో రెండు క్వాలిఫైయింగ్ టీమ్స్ తో తొలి రౌండ్ ఆడనున్నాయి.

Exit mobile version