Site icon HashtagU Telugu

Ind vs NZ: తొలి టీ ట్వంటీ వర్షార్పణం..

Indvsnz

Indvsnz

భారత్, న్యూజిలాండ్ మధ్య టీ ట్వంటీ సమరాన్ని వీక్షిద్దామనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. తొలి టీ ట్వంటీ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ జరిగే రోజు ఉదయం నుంచీ వర్షం కురుస్తూనే ఉంది. మ్యాచ్ ఆరంభ సమయానికి కూడా తెరపినివ్వవలేదు. మధ్యలో ఆగినట్టు కనిపించినా… క్రమంగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో చాలా సేపు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రెండు జట్ల మధ్య రెండో టీ ట్వంటీ ఆదివారం జరగుతుంది. ఆ మ్యాచ్ కు కూడా వరుణుడు అడ్డుపడే అవకాశాలున్నాయి.

రెండు రోజుల సమయం ఉండడంతో అప్పటికి వర్షం తగ్గాలని నిర్వాహకులు, అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తొలి టీ ట్వంటీ కోసం ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. వర్షంతో రద్దవడంతో నిరాశకు గురయ్యారు. కాగా ఈ పర్యటనలో భారత జట్టు మూడు టీ ట్వంటీలు, మూడు వన్డేలు ఆడనుంది. రోహిత్, కోహ్లీ తో సహా పలువురు సీనియర్ ఆటగాళ్ళకు రెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో హార్థిక్ పాండ్యా జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు.