Site icon HashtagU Telugu

India vs New Zealand: కివీస్‌పై భారత్ ఘన విజయం.!

Cropped (3)

Cropped (3)

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత భారత్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కివీస్‌ 126 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపక్‌ హుడా 4 వికెట్లు, అర్ష్‌దీప్‌, చాహల్‌ చెరో 2 వికెట్లు, భువనేశ్వర్‌, సుందర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అంతకుముందు.. భారత్-న్యూజిలాండ్‌ మధ్య మౌంట్‌ మాంగనుయ్‌లో రెండో టీ20 మ్యాచ్ లో భారత్ టాస్ ఓడిపోవడంతో న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ సూపర్‌ సెంచరీ (111*)తో విజృంభించడంతో 20 ఓవర్లకు భారత్‌ 191/6 స్కోర్ చేసింది. ఇషాన్‌ (36), శ్రేయస్‌ (13), హార్దిక్‌ (13) పరుగులతో రాణించారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్‌ రెండు, ఇష్‌ సోథీ ఒక వికెట్‌ తీశారు. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ జట్టు 126 పరుగులకే కుప్పకూలింది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దు అయింది.