Site icon HashtagU Telugu

India vs New Zealand: టీమిండియా ఘ‌న విజ‌యం.. సెమీస్‌లో ఆసీస్‌తో ఢీ!

ICC

ICC

India vs New Zealand: ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ (India vs New Zealand)ను ఓడించింది. దీంతో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. దీంతో ఇప్పుడు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అరంగేట్రం ఆడుతున్న వరుణ్ చక్రవర్తి అద్భుత బౌలింగ్‌ను ప్రదర్శించాడు. వరుణ్ 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. కాగా కుల్దీప్, జడేజా, షమీ, అక్షర్ తలా ఒక వికెట్ అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 249 పరుగులు చేసింది. దీనిని ఛేదించేందుకు వ‌చ్చిన‌ న్యూజిలాండ్ జట్టు కేవలం 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో కేన్ విలియమ్సన్ 120 బంతుల్లో 81 పరుగులు చేశాడు.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత తొలుత ఆడిన భారత జట్టుకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీంతో టీమిండియా 30 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ఇందులో శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లు ఉన్నాయి. దీని తర్వాత శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ మధ్య ఒక ముఖ్యమైన భాగస్వామ్యం కనిపించింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ 61 బంతుల్లో 42 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. రచిన్.. అక్షర్‌ని ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ 23 పరుగుల స్వల్ప ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read: Rushikonda Beach : బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు..అసలు నిజం ఇదే..!

రాహుల్‌ను కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కి వచ్చాడు. హార్దిక్ 45 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ స్కోరు 50 ఓవర్లలో 249 పరుగులకు చేరుకుంది. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. 98 బంతుల్లో 79 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ తరఫున మ్యాట్ హెన్రీ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. కివీస్ తరఫున 5 వికెట్లు తీశాడు. కాగా, రచిన్ రవీంద్ర, మిచెల్ సాట్నర్, కైల్ జేమిసన్, విలియం ఓ రూర్కే త‌లో ఓ వికెట్ తీశారు.