India vs New Zealand: విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 50 పరుగుల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఘోరంగా ప్రారంభమైన టీమ్ ఇండియా ఇన్నింగ్స్
216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ అభిషేక్ శర్మ అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. అందరి కళ్ళు సంజూ శాంసన్‌పైనే ఉండగా, ఆయనకు మంచి ఆరంభం లభించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వేసిన బంతికి 24 పరుగుల వద్ద సంజూ క్లీన్ బౌల్డ్ అయ్యారు.
Also Read: స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?
నెం.4లో రింకూ సింగ్ ప్రయోగం సాధారణంగా ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే రింకూ సింగ్‌ను ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానానికి ప్రమోట్ చేశారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రింకూ సింగ్ బాధ్యతాయుతంగా ఆడి 30 బంతుల్లో 39 పరుగులు చేశారు. అయితే మిగిలిన బ్యాటర్ల నుండి సరైన మద్దతు లభించకపోవడంతో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
మెరిసిన శివమ్ దూబే
భారత జట్టు 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో శివమ్ దూబే క్రీజులోకి వచ్చారు. ఆయన రాగానే కివీస్ బౌలర్లపై విరుచుకుపడి విధ్వంసకర షాట్లు ఆడారు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ సాధించిన మూడవ బ్యాటర్‌గా దూబే రికార్డుకెక్కారు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ మాత్రమే ఆయన కంటే ముందున్నారు. మొత్తంగా దూబే 23 బంతుల్లో 65 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు.
శాట్నర్ స్పిన్ మ్యాజిక్
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ తన అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను కివీస్ వైపు తిప్పారు. ఆయన తన 4 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వికెట్లను తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు.ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ నాలుగు మ్యాచ్‌ల తర్వాత ఈ సిరీస్‌లో టీమ్ ఇండియా ప్రస్తుతం 3-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
